భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. విరాట్ తన పుట్టిన రోజు నాడు అలా చేస్తే చూడాలని ఉందన్నాడు.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. విరాట్ తన పుట్టిన రోజు నాడు అలా చేస్తే చూడాలని ఉందన్నాడు.
విరాట్ కోహ్లీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుత తరంలో బెస్ట్ ప్లేయర్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉండే ప్లేయర్. తనకు నేమ్, ఫేమ్ ఇచ్చిన క్రికెట్ గ్లోబల్ స్పోర్ట్స్‌గా అవతరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాడు. క్రికెట్ అంటే ఏంటో తెలియని వారికి కూడా కోహ్లీ తెలుసని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతగా జెంటిల్మన్ గేమ్‌తో పాటు వరల్డ్ స్పోర్ట్స్ మీద తనదైన ముద్ర వేశాడు కోహ్లీ. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా దూకుడు ప్రదర్శిస్తూ క్రికెట్‌కు ఈతరంలో రియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు విరాట్. అతడో టోర్నమెంట్లో లేదా మ్యాచ్‌లో ఆడుతున్నాడంటే దానికి వచ్చే వ్యూయర్షిప్ వేరే లెవల్లో ఉంటుందనే చెప్పాలి.
కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడంటే చాలు.. పనులన్నీ మానేసి ఫోన్, లేదా టీవీ స్క్రీన్కు అతుక్కుపోవాల్సిందే. అతడి ఆట చూడటానికి అంత బాగుంటుంది. ఫార్మాట్ ఏదైనా పిచ్‌పై సెటిల్ అయ్యే వరకు సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేయడం.. మ్యాచ్ సిచ్యువేషన్‌ను బట్టి గేర్లు మార్చి అవసరమైతే హిట్టింగ్‌కు దిగడం విరాట్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఛేజింగ్లోనైతే ఎన్ని వికెట్లు ఉన్నాయి, ఎన్ని బంతుల్లో ఎన్ని రన్స్ కొట్టాలనే పర్ఫెక్ట్ ఈక్వేషన్స్‌తో అతడి బ్యాటింగ్ సాగుతుంది. చెత్త షాట్లు, అనవసర ప్రయోగాలు కోహ్లీ బ్యాటింగ్‌లో కనిపించవు. క్రికెటింగ్ షాట్స్‌తో పద్ధతిగా ఆడతాడు. అందుకే అతడ్ని ఔట్ చేయడం అంత ఈజీ కాదు.
క్రికెట్లో ఎంతో సాధించిన విరాట్ కోహ్లీ.. మరిన్ని రికార్డులు బ్రేక్ దిశగా దూసుకెళ్తున్నాడు. నవంబర్ 5వ తేదీన అతడి బర్త్ డే అనేది తెలిసిందే. అదే రోజు సౌతాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్‌పై ప్రశంసల జల్లులు కురిపించిన పాక్ కీపర్.. అతడికి తన తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. బర్త్ డే నాడు విరాట్ తన వన్డే కెరీర్లో 49వ సెంచరీ సాధించాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ వరల్డ్ కప్‌లోనే కోహ్లీ 50వ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోవాలని కోరుకుంటున్నానని రిజ్వాన్ పేర్కొన్నాడు. మరి.. కోహ్లీపై రిజ్వాన్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2024పై బాంబు పేల్చిన ధోని.. అన్నీ బాగుంటేనే అంటూ..!
Mohammed Rizwan said, “hope Virat Kohli gets his 49th and 50th century in this World Cup”. pic.twitter.com/nueDEedGq5
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2023