ఆ విషయంలో రోహిత్-కోహ్లీ మధ్య వాదన! ఏకంగా గ్రౌండ్​లోనే..!

  • Author singhj Published - 07:38 PM, Mon - 23 October 23

న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఒక విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య వాదన జరిగింది. ఈ ఇద్దరు ప్లేయర్లు గ్రౌండ్​లో సీరియస్​గా మాట్లాడుకుంటూ కనిపించారు.

న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఒక విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య వాదన జరిగింది. ఈ ఇద్దరు ప్లేయర్లు గ్రౌండ్​లో సీరియస్​గా మాట్లాడుకుంటూ కనిపించారు.

  • Author singhj Published - 07:38 PM, Mon - 23 October 23

వన్డే వరల్డ్ కప్​లో టీమిండియా దూకుడుకు ఎదురే లేకుండా పోయింది. ఫస్ట్ మ్యాచ్​లో ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. ఆ తర్వాతి మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​పై ఈజీగా గెలిచింది. ఎంతో ఆసక్తి రేకెత్తించిన పాకిస్థాన్​తో మ్యాచ్​లో దాయాదిని చిత్తుగా ఓడించింది. వరుస విజయాలు వస్తున్నా ఎక్కడో చిన్న అనుమానం. భారత్​లాగే నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్​ను రోహిత్ సేన ఆపగలదా అనే సందేహాలు తలెత్తాయి. అసలే ఆ టీమ్​పై మనకు వరల్డ్ కప్​లో రికార్డు బాగోలేదు. ఇండియాతో మ్యాచ్ అంటే చాలు కివీస్ ప్లేయర్లు చెలరేగి ఆడతారు. దీంతో భారత జట్టు ఒత్తిడిలో చిత్తవుతుందేమోనని అంతా అనుకున్నారు.

న్యూజిలాండ్​పై ఎలాగైనా గెలవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకున్నారు. ఆ టీమ్​తో లెక్క సరిచేయాలని ప్లేయర్లు కూడా గట్టిగా అనుకున్నారు. అనుకున్నట్లే నిన్న కివీస్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ బంపర్ విక్టరీ కొట్టింది. అందర్నీ ఓడిస్తూ వస్తున్న న్యూజిలాండ్​ను ఓడించి తాము ఈసారి హాట్ ఫేవరెట్స్​ అని మరోమారు నిరూపించుకుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లకు 273 రన్స్​కు ఆలౌట్ అయింది. ఆ టీమ్​లో డారిల్ మిచెల్ (130) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడికి రచిన్ రవీంద్ర (75) మంచి సహకారం అందించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీకి 5 వికెట్లు దక్కాయి. కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

టార్గెట్​ ఛేజింగ్​కు దిగిన టీమిండియాకు మంచి స్టార్ట్ దొరికింది. రోహిత్ శర్మ (46), శుబ్​మన్ గిల్ (26) కలసి ఫస్ట్ వికెట్​కు 71 రన్స్ జోడించారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (95) సూపర్బ్ బ్యాటింగ్​తో టీమ్​ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. చివర్లో కోహ్లీ ఔటైనా రవీంద్ర జడేజా (39 నాటౌట్) మిగిలిన పనిని పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్​లో కివీస్ ఇన్నింగ్స్ టైమ్​లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్య వాదన జరిగింది. హిట్​మ్యాన్​పై కోహ్లీ సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఇద్దరూ ఇలా గ్రౌండ్​లో ఎందుకు వాదనకు దిగారని అనుకుంటున్నారు. అప్పటికి 31 ఓవర్లు పూర్తయ్యాయి. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

మిడిల్ ఓవర్లలో రచిన్ రవీంద్ర, మిచెల్​లు కలసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్​లో సిక్సులు, జడేజా బౌలింగ్​లో బౌండరీలు మీద బౌండరీలు కొడుతున్నారు. వికెట్లు పడకపోవడంతో పాటు రన్స్ కూడా భారీగా లీక్ అవుతుండటంతో టీమిండియా ఒత్తిడిలో కనిపించింది. వాళ్లిద్దర్నీ ఎలా ఔట్ చేయాలో తెలియక బౌలర్లు టెన్షన్ పడుతున్నారు. అదే టైమ్​లో రోహిత్ దగ్గరకు వచ్చాడు కోహ్లీ. రచిన్-మిచెల్ జోడీని విడదీయడంపై, బౌలింగ్ ఛేంజెస్ మీద ఇద్దరూ సీరియస్​గా మాట్లాడుకున్నట్లు కనిపించింది. హిట్​మ్యాన్​ కాస్త కూల్​గానే ఉన్నా విరాట్ మాత్రం తన మాట వినాల్సిందే అన్నట్లుగా సీరియస్​గా ఏదో సలహా ఇస్తున్నట్లు కనిపించాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య గ్రౌండ్​లో ఏదో జరిగిందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత కివీస్ వికెట్లు పడుతున్న టైమ్​లో రోహిత్, హిట్​మ్యాన్ నవ్వుతూ కనిపించారు. మ్యాచ్ పూర్తయ్యాక కూడా కోహ్లీ-రోహిత్ ఒకర్నొకరు హగ్ చేసుకున్నారు. మరి.. గ్రౌండ్​లో రోహిత్​తో కోహ్లీకి మధ్య జరిగిన వాదనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: అనవసరంగా బుమ్రాను అంటున్నారు.. తప్పు అతడిది కాదు!

Show comments