iDreamPost
android-app
ios-app

ద్రవిడ్, రోహిత్ కాదు.. టీమిండియా విజయాల వెనుక ఓ అదృశ్య శక్తి!

  • Author singhj Published - 04:20 PM, Fri - 20 October 23

ప్రపంచ కప్​లో టీమిండియా వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. అయితే భారత జట్టు విజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్లానింగ్, టీమ్ సమష్టిగా రాణించడమేనని అంతా అనుకుంటున్నారు. అయితే రోహిత్ సేన సక్సెస్ వెనుక ఓ కనిపించని అదృశ్య శక్తి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ కప్​లో టీమిండియా వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. అయితే భారత జట్టు విజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్లానింగ్, టీమ్ సమష్టిగా రాణించడమేనని అంతా అనుకుంటున్నారు. అయితే రోహిత్ సేన సక్సెస్ వెనుక ఓ కనిపించని అదృశ్య శక్తి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 04:20 PM, Fri - 20 October 23
ద్రవిడ్, రోహిత్ కాదు.. టీమిండియా విజయాల వెనుక ఓ అదృశ్య శక్తి!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా మరో విజయాన్ని అకౌంట్​లో వేసుకుంది. బంగ్లాదేశ్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్​లో భారత్ విక్టరీ సాధించింది. మెగా టోర్నీలో రోహిత్ సేనకు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. బ్యాటింగ్, బౌలింగ్​, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా ఆధిక్యం ప్రదర్శించిన భారత్ బంగ్లాను చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీఫైనల్ ఛాన్స్​ను మరింత మెరుగుపర్చుకుంది. అయితే మున్ముందు న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి బలమైన టీమ్స్​తో తలపడనుంది. ప్లేయర్లు అందరూ మంచి టచ్​లో ఉండటం, జట్టు కూడా సూపర్బ్ ఫామ్​లో ఉన్న నేపథ్యంలో ఆ మ్యాచ్​ల్లోనూ భారత్​ నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటీవల జరిగిన ఆసియా కప్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఇప్పుడు వరల్డ్ కప్.. ఈ మూడు టోర్నీల్లోనూ భారత్ వరుస విజయాలు సాధించింది. ఆసియా కప్​లో విజేతగా నిలిచిన రోహిత్ సేన.. ఆసీస్​తో వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలుచుకుంది. వరల్డ్ కప్​లో ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్​ల్లోనూ విజయం టీమిండియానే వరించింది. అయితే దీనికి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్​కు క్రెడిట్ ఇస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. రోహిత్ మిగిలిన ఆటగాళ్లతో మరింత కలిసిపోయి వాళ్లకు అవసరమైనప్పుడల్లా సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. కెప్టెన్సీ నాక్స్ ఆడుతూ యంగ్ ప్లేయర్స్​కు ఎగ్జాంపుల్​గా నిలుస్తున్నాడు. స్ట్రెస్​ను తాను తీసుకొని మిగిలిన వారు స్వేచ్ఛగా ఆడేలా చూసుకుంటున్నాడు. అందుకు అతడ్ని తప్పకుండా అభినందించాల్సిందే.

భారత్ వరుస విజయాలకు కోచ్ రాహుల్ ద్రవిడ్​ను కూడా మెచ్చుకోవాలి. మొదట్లో ఆయన చేసిన ప్రయోగాలు, తీసుకున్న నిర్ణయాలు ఎవరికీ పెద్దగా నచ్చలేదు. గాయాల తర్వాత కమ్​బ్యాక్ ఇస్తున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వారిని బ్యాకప్ చేశాడు ద్రవిడ్. స్పిన్​ను బాగా ఎదుర్కొనే అయ్యర్, అవసరాన్ని బట్టి గేర్లు మారుస్తూ ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లే రాహుల్ టీమ్​లో పక్కా ఉండాల్సిందేనని పట్టుపట్టాడు. వారిపై ద్రవిడ్ ఉంచిన నమ్మకం వమ్ము కాలేదు. అది మంచి ఫలితాలను ఇస్తోంది. వీళ్లిద్దరితో పాటు టీమ్​లోని మిగతా యంగ్ ప్లేయర్స్​కూ సపోర్ట్​గా నిలిచిన ద్రవిడ్.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారత్​ సక్సెస్​లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

టీమిండియా వరుస విజయాలకు రోహిత్, ద్రవిడ్​ను మాత్రమే మెచ్చుకుంటే సరిపోదు. రోహిత్ సేన సక్సెస్ వెనుక కనిపించని ఓ అదృశ్య శక్తి ఉంది. ఆసియా కప్​కు ముందు వరకు భారత జట్టు విషయంలో ఎన్నో సందేహాలు ఉండేవి. టీమ్ తుది కూర్పు ఎలా ఉంటుంది? అసలు ఆ టోర్నీలో ఫైనల్స్ వరకు వెళ్తారా? అంటూ డౌట్స్ వచ్చాయి. ఇంజ్యురీ నుంచి తిరిగొచ్చిన కేఎల్​ రాహుల్​ను ఆడిస్తారా? శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్​గా ఉన్నాడా? జస్​ప్రీత్ బుమ్రా మునుపటి ఫామ్​ను అందుకుంటాడా? రవిచంద్రన్ అశ్విన్​ను హఠాత్తుగా వరల్డ్ కప్ స్క్వాడ్​లోకి ఎందుకు తీసుకున్నారు? అంటూ చాలా ప్రశ్నలు టీమ్ మేనేజ్​మెంట్​ను ఆందోళనకు గురిచేశాయి. అయితే వీటన్నింటికీ ఆన్సర్లు ఆసియా కప్, వరల్డ్ కప్​లో దొరికేశాయి. డౌట్ పడిన పై ప్లేయర్లు అందరూ తమ పెర్ఫార్మెన్స్​లతో అదరగొడుతున్నారు.

కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, జస్​ప్రీత్ బుమ్రా, కుల్​దీప్ యాదవ్.. టీమిండియా వరుస విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్లేయర్లు. వీళ్లందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అదే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ). పైప్లేయర్స్ అందరూ ఇటీవల కాలంలో ఎన్​సీఏకు వెళ్లి వచ్చినవారే. అక్కడ కొన్నాళ్ల పాటు ఉన్న కుల్​దీప్ గాయం మానాక తన బౌలింగ్​ శైలిపై దృష్టి పెట్టాడు. ఎన్​సీఏలోని కోచ్​ల సాయంతో వికెట్లకు దగ్గరగా వచ్చి బంతులు వేయడం నేర్చుకున్నాడు. ఇంతకు ముందు కంటే మంచి రిథమ్​లో బౌలింగ్ వేస్తున్న ఈ చైనామన్​.. బంతులను మరింత వేగంగా విసురుతున్నాడు. ఎన్​సీఏలో ఉండటం వల్ల కుల్​దీప్ బౌలింగ్ ఎంతగానో మెరుగుపడింది. ఇప్పుడు టీమిండియాకు మిడిల్ ఓవర్లలో అతను ప్రధాన బలంగా తయారయ్యాడు.

శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. రీసెంట్​గా ఎన్​సీఏకి వెళ్లొచ్చిన వారిలో వీళ్లూ ఉన్నారు. అక్కడ వీళ్లిద్దరూ తమ ఫిట్​నెస్ మీద మరింత శ్రద్ధ పెట్టారు. రాహుల్ కీపింగ్ స్కిల్స్​ను మెరుగుపర్చుకున్నాడు. అనవసర షాట్ల జోలికి పోకుండా ఇన్నింగ్స్​ను బిల్డ్ చేయడం, ఓపిగ్గా ఆడుతూ క్రీజులో పాతుకుపోవడం ఎలా అనే దానిపై అక్కడి కోచ్​ల సాయం తీసుకొని సాధన చేశాడు. అయ్యర్ అయితే తన షార్ట్ బాల్ వీక్​నెస్ నుంచి బయట పడేందుకు ఎన్​సీఏను ఉపయోగించుకున్నాడు. దీని రిజల్ట్ మెగా టోర్నీలో కనిపిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు అతను పుల్ షాట్స్ చాలా బాగా ఆడుతున్నాడు. టీమ్​లోకి వస్తాడో లేదో అనుకున్న బుమ్రా తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఎన్​సీఏలో పునరావాసంలో ఉంటూ మునుపటి రిథమ్​ను అందుకున్నాడు బుమ్రా. బాల్​ను ఇరువైపులా స్వింగ్ చేయడంలో ఇప్పడు మరింత బెటర్మెంట్ సాధించాడు. ఎన్​సీఏలో రోజుకు దాదాపు 10 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయడం, ఫిట్​నెస్​ను బాగా మెరుగుపర్చుకోవడంతో లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్​కు అలవాటు పడ్డాడు బుమ్రా. అందుకే వరల్డ్ కప్​లో లాంగ్ స్పెల్స్ కూడా ఈజీగా వేసేస్తున్నాడు. ఇక, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే ముందు ప్రకటించిన వరల్డ్ కప్ స్క్వాడ్​లో లేడు. కానీ అతడ్ని ద్రవిడ్, రోహిత్ ఎప్పటి నుంచో ఎన్​సీఏలో ఉంచి ప్రాక్టీస్ చేయించారని వినికిడి.

ఎప్పుడు అవసరం వచ్చినా టీమ్​లోకి రావాలని అశ్విన్​కు టీమ్ మేనేజ్​మెంట్ నుంచి ముందే ఆదేశాలు వెళ్లాయట. దీంతో వన్డేలకు తగ్గట్లు తన ఫిట్​నెస్​ను బెటర్ చేసుకోవడంతో పాటు బౌలింగ్ వేరియషన్స్ మీద పనిచేసేందుకు ఎన్​సీఏను వినియోగించుకున్నాడు అశ్విన్. దీన్ని బట్టి ఎన్​సీఏ ప్లేయర్ల ఇంజ్యురీ తగ్గించడమే కాదు వారిని ఫుల్​ ఫిట్​గా తయారు చేసి.. వాళ్ల స్కిల్స్​ను మరింత మెరుగుపరిచి టీమిండియాకు అందిస్తోందన్న మాట. అందుకే రోహిత్ సేన విజయాల వెనుక కనిపించని శక్తిగా ఎన్​సీఏను చెబుతున్నారు క్రికెట్ అనలిస్టులు. మరి.. టీమిండియాకు ఎన్​సీఏ అందిస్తున్న సేవలు, సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హార్దిక్ పాండ్యా హెల్త్​పై లేటెస్ట్ అప్డేట్!