వరల్డ్ కప్-2023లో బెస్ట్ ఫీల్డింగ్ చేస్తున్న భారత ప్లేయర్స్‌కు టీమిండియా కోచింగ్ స్టాఫ్ కలసి మెడల్స్ అందిస్తున్నారు. ఎన్నడూ లేనిది కొత్తగా గోల్డ్ మెడల్స్ ఎందుకు ఇస్తున్నారనే క్వశ్చన్ మీకు కలగొచ్చు. అయితే దీని వెనుక కోచ్ ద్రవిడ్ మాస్టర్ మైండ్ ఉంది. అతడి ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ కప్-2023లో బెస్ట్ ఫీల్డింగ్ చేస్తున్న భారత ప్లేయర్స్‌కు టీమిండియా కోచింగ్ స్టాఫ్ కలసి మెడల్స్ అందిస్తున్నారు. ఎన్నడూ లేనిది కొత్తగా గోల్డ్ మెడల్స్ ఎందుకు ఇస్తున్నారనే క్వశ్చన్ మీకు కలగొచ్చు. అయితే దీని వెనుక కోచ్ ద్రవిడ్ మాస్టర్ మైండ్ ఉంది. అతడి ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ ఎంత కీలకమో ఫీల్డింగ్ కూడా అంతే ముఖ్యమనేది తెలిసిందే. ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అనే నానుడి కూడా వినే ఉంటారు. ఫీల్డింగ్ స్త్రెంగ్త్పై క్రికెట్ ఆడిన సౌతాఫ్రికా లాంటి కొన్ని టీమ్స్ ఉన్నాయి. అప్పట్లో సఫారీ టీమ్‌లో బౌలింగ్ బాగున్నా, బ్యాటింగ్ సోసోగానే ఉండేది. అయినా జాంటీ రోడ్స్ లాంటి మెరికల్లాంటి ఫీల్డర్లు ప్రత్యర్థులను రన్స్ చేయకుండా కట్టడి చేసేవారు. సౌతాఫ్రికాను చూసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి ఇతర టీమ్స్ కూడా ఫీల్డింగ్‌ను బలంగా మార్చుకోవడంపై ఫోకస్ చేశాయి. భారత జట్టులో ఒకప్పుడు మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ లాంటి బెస్ట్ ఫీల్డర్స్ ఉండేవారు. జాన్‌రైట్ కోచింగ్‌లో మన టీమ్ ఫీల్డింగ్ బలోపేతంపై దృష్టి సారించింది.
విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాక టీమిండియా స్వరూపమే మారిపోయింది. ఫిట్‌నెస్‌కు ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన కోహ్లీ.. ఫీల్డింగ్ ప్రమాణాలను కూడా పెంచడంపై ఫోకస్ పెట్టాడు. అయితే ఈ మధ్య కాలంలో మన టీమ్ ఫీల్డింగ్‌లో కాస్త వీక్‌గా తయారైంది. రీసెంట్గా చూసుకుంటే.. వెస్టిండీస్ టూర్‌తో పాటు ఆసియా కప్ టైమ్‌లోనూ భారత ఫీల్డింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈజీ క్యాచెస్ వదలేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్‌లో రన్స్ లీక్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో కోచ్ రాహుల్ ద్రవిడ్, ఫీల్డింగ్ కోచ్‌తో కలసి అదిరిపోయే స్కెచ్ వేశాడు. అది బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ద్రవిడ్ ప్లాన్ రిజల్ట్ వరల్డ్ కప్‌లో కనిపిస్తోంది.
వరల్డ్ కప్‌లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా నెగ్గింది. ఈ ఐదు మ్యాచుల్లోనూ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లు అద్భుతమైన క్యాచులు అందుకున్నారు. గతంతో పోలిస్తే గ్రౌండ్ ఫీల్డింగ్ బెటర్ అవ్వడగే గాక క్లిష్టమైన క్యాచులను కూడా మన ఫీల్డర్లు అందుకుంటున్నారు. సడన్‌గా ఫీల్డింగ్ మనకు బిగ్ స్ట్రెంగ్త్‌గా కనిపిస్తోంది. దీని వెనుక కోచ్ ద్రవిడ్ పక్కా ప్లానింగ్ కనిపిస్తోంది. రీసెంట్ సిరీస్‌ల్లో భారత టీమ్ ఫీల్డింగ్‌లో ఫెయిలైన నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌తో కలసి ద్రవిడ్ కొత్త ఐడియా వేశాడు.
వరల్డ్ కప్‌లో బెస్ట్ ఫీల్డింగ్ చేసిన వారికి గోల్డ్ మెడల్స్ ఇవ్వాలని ద్రవిడ్ ఫిక్స్ అయ్యాడు. దీంతో ఈ మెడల్ కోసం ఆటగాళ్ల మధ్య పోటీ పెరిగింది. అవార్డు వల్ల మంచి పేరు కూడా వస్తుండటంతో దీని కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. క్రికెటర్స్ మధ్య పోటీ వాతావరణం నెలకొల్పడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో మరింత జోష్ నింపేందుకే ఈ అవార్డును ద్రవిడ్ ప్రవేశపెట్టాడని సమాచారం. మొత్తానికి ఫీల్డింగ్ బలహీనతను బలంగా మార్చేసిన బలంగా మార్చిన కోచ్ ద్రవిడ్, టీమ్ మేనేజ్మెంట్పై భారత ఫ్యాన్స్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరి.. ఫీల్డింగ్ విషయలో ద్రవిడ్ వేసిన ప్లాన్‌ఫై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు గిల్ వార్నింగ్.. బయటకు తీస్తానంటూ..!
Spidercam revealed Shreyas Iyer as the medal winner.
– Lovely to see such stuff after the match. pic.twitter.com/SpLKucUe6u
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2023