రోహిత్ రికార్డుపై కన్నేసిన స్టార్ బ్యాటర్.. హిట్​మ్యాన్​ ఘనతకు మూడినట్లే!

  • Author singhj Published - 03:14 PM, Sat - 4 November 23

రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై ఒక స్టార్ బ్యాటర్ కన్నేశాడు. ఎలాగైనా సరే హిట్​మ్యాన్ ఘనతను తానూ అందుకోవాలని చూస్తున్నాడు. కుదిరితే ఈ వరల్డ్ కప్​లో రోహిత్ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.

రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై ఒక స్టార్ బ్యాటర్ కన్నేశాడు. ఎలాగైనా సరే హిట్​మ్యాన్ ఘనతను తానూ అందుకోవాలని చూస్తున్నాడు. కుదిరితే ఈ వరల్డ్ కప్​లో రోహిత్ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.

  • Author singhj Published - 03:14 PM, Sat - 4 November 23

వన్డే వరల్డ్ కప్​-2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి భారత్, సౌతాఫ్రికా. ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నెగ్గి పాయింట్స్ టేబుల్​లో టాప్ ప్లేస్​లో ఉంది టీమిండియా. సఫారీ టీమ్ మెగా టోర్నీలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింట్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. కేవలం నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో మాత్రమే ఆ టీమ్ ఓటమి పాలైంది. అయితే మిగిలిన మ్యాచుల్లో మాత్రం బవుమా సేన భారత్​లాగే అటాకింగ్ గేమ్​తో అదరగొట్టింది. ముఖ్యంగా సౌతాఫ్రికా బ్యాటర్లు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ టీమ్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అయితే ఈ వరల్డ్ కప్​లో ఆడిన ఏడు మ్యాచుల్లో ఏకంగా 4 సెంచరీలు బాదాడు.

ఈ ప్రపంచ కప్​లో ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో కలిపి 545 రన్స్ చేశాడు డికాక్. తద్వారా అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల లిస్టులో ఫస్ట్ ప్లేస్​లో నిలిచాడు. అతడి తర్వాతి స్థానాల్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (442 రన్స్), కివీస్ నయా స్టార్ రచిన్ రవీంద్ర (415 రన్స్), ఆసీస్ సీనియర్ బ్యాట్స్​మన్ డేవిడ్ వార్నర్ (413 రన్స్), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (402 రన్స్) ఉన్నారు. సౌతాఫ్రికా టీమ్​లో డికాక్​తో పాటు ఎయిడెన్ మార్క్​రమ్ (362) , వాండర్ డస్సెన్ (353), క్లాసెన్ (315) కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో ఆ టీమ్​కు ఎదురే లేకుండా పోతోంది. అయితే నవంబర్ 5న, కోల్​కతాలో భారత్​తో జరిగే మ్యాచ్​ సఫారీ టీమ్​కు అసలైన పోటీగా చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఓటమనేదే లేకుండా ఉన్న టీమిండియా, భీకరమైన ఫామ్​లో ఉన్న సౌతాఫ్రికాల మధ్య జరిగే ఫైట్​లో ఎవరు గెలుస్తారో ఇంట్రెస్టింగ్​గా మారింది.

భారత్​తో మ్యాచ్​లో రోహిత్ శర్మ అరుదైన ఘనతపై సఫారీ ఓపెనర్ డికాక్ కన్నేశాడు. ఈ వరల్డ్ కప్​లో 4 సెంచరీలు బాదిన డికాక్.. మరో శతకం చేస్తే ప్రపంచ కప్​లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ (5 సెంచరీలు)తో సమానంగా నిలుస్తాడు. అలాగే ఇంకో సెంచరీ బాదితే అతడి రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు. లీగ్​లో మరో రెండు మ్యాచ్​లు, సెమీస్​ కూడా ఉన్నందున హిట్​మ్యాన్ రికార్డును బ్రేక్ చేయాలని డికాక్ అనుకుంటున్నాడు. దీంతో రోహిత్ ఘనతకు మూడిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే డికాక్​కు అంత సీన్ లేదని.. భారత బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేయడం కష్టమని అంటున్నారు. సెమీస్​లోనూ టీమిండియా ఎదురుపడితే డికాక్ సెంచరీ కొట్టలేడని.. రోహిత్ రికార్డు సేఫ్ అని చెబుతున్నారు. మరి.. రోహిత్ సెంచరీల రికార్డును డికాక్ బ్రేక్ చేస్తాడని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెమీస్​కు ముందు భారత్​కు భారీ షాక్.. వరల్డ్‌ కప్​కు స్టార్ ప్లేయర్ దూరం!

Show comments