iDreamPost
android-app
ios-app

VIDEO: ఆఫ్ఘాన్ టీమ్​లో ఇది గమనించారా? వాళ్లిద్దరూ సేమ్ టు సేమ్!

  • Author singhj Published - 07:53 PM, Fri - 3 November 23

మిగతా అన్ని టీమ్స్​తో కంపేర్ చేస్తే ఆఫ్ఘానిస్థాన్ జట్టులో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ టీమ్​లో ఇద్దరు ప్లేయర్లు ఒకేలా ఆడటాన్ని గమనించి ఉండరు. ఇద్దరు క్రికెటర్ల సేమ్ టు సేమ్ బౌలింగ్​ యాక్షన్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మిగతా అన్ని టీమ్స్​తో కంపేర్ చేస్తే ఆఫ్ఘానిస్థాన్ జట్టులో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ టీమ్​లో ఇద్దరు ప్లేయర్లు ఒకేలా ఆడటాన్ని గమనించి ఉండరు. ఇద్దరు క్రికెటర్ల సేమ్ టు సేమ్ బౌలింగ్​ యాక్షన్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Author singhj Published - 07:53 PM, Fri - 3 November 23
VIDEO: ఆఫ్ఘాన్ టీమ్​లో ఇది గమనించారా? వాళ్లిద్దరూ సేమ్ టు సేమ్!

ఆప్ఘానిస్థాన్.. క్రికెట్​లో పసికూన జట్లలో ఒకటిగా దీన్ని చెబుతుంటారు. పెద్ద టీమ్స్​తో పెద్దగా ఆడని ఆప్ఘాన్.. ఎక్కువగా అసోసియేట్ దేశాలతోనే మ్యాచులు ఆడుతుంటుంది. అయితే ఆ టీమ్​లో ఉన్న రషీద్ ఖాన్, మహ్మద్ నబి, నవీన్ ఉల్ హక్ లాంటి ప్లేయర్లు మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి బడా టోర్నీల్లో టాప్ క్రికెటర్స్​తో కలసి ఆడుతూ తమ స్కిల్స్​ను ఇంప్రూవ్ చేసుకున్నారు. అనుక్షణం తమను తాము మెరుగుపర్చుకున్నారు. ఆ రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. లీగ్స్​లోనే కాదు.. ఆఫ్ఘాన్ టీమ్ తరఫున బరిలోకి దిగుతున్నప్పుడు కూడా వీళ్లు అదిరిపోయేలా పెర్ఫార్మ్ చేస్తున్నారు.

వన్డే వరల్డ్ కప్-2023లో ఆఫ్ఘానిస్థాన్ అద్భుతంగా ఆడుతోంది. వరుస విజయాలతో పసికూన అనే ఇమేజ్ చెరిపేసుకుంది. ఇంగ్లండ్​తో పాటు పాకిస్థాన్ లాంటి బడా టీమ్స్​ను మట్టికరిపించి తాము ఎంత డేంజరస్ అనేది ప్రూవ్ చేసింది. అలాగే శ్రీలంకను కూడా చిత్తు చేసి తమను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరికలు పంపించింది. ఇప్పుడు నెదర్లాండ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లోనూ విజయం దిశగా దూసుకెళ్తోంది ఆఫ్ఘానిస్థాన్. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన డచ్ టీమ్ 46.3 ఓవర్లలో 179 రన్స్​కు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఛేజింగ్ మొదలుపెట్టిన ఆఫ్ఘాన్ ప్రస్తుతం 11.1 ఓవర్లలో 2 వికెట్లకు 61 రన్స్​తో ఉంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఆఫ్ఘాన్ టీమ్​లో ఒక విషయాన్ని మీరు గమనించారా?

ఇప్పటివరకు ఎక్కడా చూడని ఒక స్పెషాలిటీ ఆఫ్ఘానిస్థాన్ టీమ్​లో ఉంది. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్​ల బౌలింగ్​ను చూసే ఉంటారు. కానీ వీళ్లిద్దరి బౌలింగ్​ ఒకే స్టైల్​లో ఉండటం అంతగా అబ్జర్వ్ చేసి ఉండరు. అవును, రైట్ హ్యాండ్ బౌలర్ అయిన రషీద్, లెఫ్టార్మర్ అయిన నూర్​ ఒకే తరహాలో బౌలింగ్ చేస్తారు. రషీద్ ఎడమ చేతితో బౌలింగ్ వేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది నూర్ బౌలింగ్ యాక్షన్. తాజాగా దీనికి సంబంధించి ఐసీసీ ఒక వీడియోను నెట్టింట షేర్ చేసింది. ఇందులో సేమ్ టు సేమ్ ఒకే తరహాలో బౌలింగ్ చేస్తూ కనిపించారు రషీద్-నూర్​లు. మరి.. ఇద్దరు స్టార్ స్పిన్నర్ల బౌలింగ్​ యాక్షన్ ఒకేలా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఇండియా-శ్రీలంక మ్యాచ్‌లో ఎవరూ గమనించని ఫన్నీ మూమెంట్స్‌!

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)