iDreamPost
android-app
ios-app

వీళ్లకు ఇండియా అంటే ఎందుకు అంత ద్వేషం?

వరల్డ్ కప్ 2023లో టీమిండియా ప్రదర్శన చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రతి మ్యాచ్ తమదైనశైలిలో విజయం దిశగా దూసుకెళ్లారు. కప్పు కొట్టడమే లక్ష్యంగా ఫైనల్ చేరారు. అలాంటి జట్టుపై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారు.

వరల్డ్ కప్ 2023లో టీమిండియా ప్రదర్శన చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రతి మ్యాచ్ తమదైనశైలిలో విజయం దిశగా దూసుకెళ్లారు. కప్పు కొట్టడమే లక్ష్యంగా ఫైనల్ చేరారు. అలాంటి జట్టుపై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారు.

వీళ్లకు ఇండియా అంటే ఎందుకు అంత ద్వేషం?

వరల్డ్ కప్ 2023లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఒక్క మ్యాచ్ లో కూడా పరాజయం లేకండా సగర్వంగా ఫైనల్స్ చేరింది. వరల్డ్ కప్ లో ఉన్న ఏ జట్టు కూడా భారత్ పై పైచేయి సాధించలేకపోయింది. ప్రతి మ్యాచ్ లో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ విజయ కేతనం ఎగురవేసింది. అయితే భారత్ విజయాలను కొనియాడేవాళ్లు ఎంతమంది ఉన్నారో.. వారి ప్రదర్శనపై అక్కసు వెళ్లగక్కేవాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. ఏ మ్యాచ్ లో టీమిండియా గెలిచినా వెంటనే నెట్టింట నిప్పులు చెరుగుతూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా వచ్చే ప్రశ్న ఏంటంటే.. అసలు భారత్ అంటే వాళ్లకు ఎందుకు అంత ద్వేషం?

ప్రపంచ క్రికెట్ లో భారత్ పసికూన ఏమీ కాదు. ఏదో అదృష్టం కలిసొచ్చి విజయం సాధించిన పరిస్థితి అంతకంటే కాదు. ప్రపంచంలోనే మేటి జట్లను వారి గడ్డపైనే చీల్చి చెండాడిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఇంక స్వదేశంలో భారత్ ను ఓడించడం అంటే అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శనకు అత్యుత్తమం అనే ట్యాగ్ ఇవ్వడం చాలా తక్కువే అవుతుంది. ఏ విభాగం తీసుకున్నా అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఎక్కడా కూడా పేరు పెట్టడానికి ఆస్కారం లేకుండా దూసుకుపోతున్నారు. వరల్డ్ కప్ 2023 ప్రారంభం నుంచి ఎదురులేని శక్తిగా ఎదిగింది.

టీమిండియా ఆడిన 10 మ్యాచుల్లో 10 విజయాలు నమోదు చేసింది. అయితే ఈ ప్రదర్శన చూసి ఎంతో మందికి కుళ్లు పుడుతోంది. అందుకే ఎక్కడలేని ఆరోపణలను టీమిండియాపై వెళ్లగక్కుతున్నారు. పొంతన కూడా లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఒకరేమో టీమిండియా బౌలర్లకు ప్రతిసారి కొత్త బాల్ ఇస్తున్నారు అంటారు. అందుకే వాళ్లు అంత బాగా బౌలింగ్ చేస్తున్నారంటారు. ఇంకొకరేమో అంపైర్లు అంతా భారత్ కు మద్దతుగా ఉన్నారు అంటారు. తాజాగా న్యూజిలాండ్ తో మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత రోహిత్ టాస్ ఫిక్స్ చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక పాకిస్తానీ పౌరుడు అయితే ఇప్పుడు చూడండి రోహిత్ కాయిన్ తీసుకుంటాడు దానిని దూరంగా విసిరేస్తాడు. అలా చేయడం వల్ల కాయిన్ చూసేందుకు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కి సాధ్యం కాదు. అలా వాళ్లు గెలుస్తారు అంటూ వీడియోలు కూడా పెట్టాడు. అయితే అదే తరహాలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా టాస్ గెలిచాడు. మరి.. అది తప్పు కాదా అంటూ భారతీయులు నెట్టింట ఏకిపారేశారు.

ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే.. ఈ ఆరోపణలు చేస్తోంది కూడా క్రికెటర్లే కావడం. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీలు ఇలాంటి చౌకబారు మాటలు అంటూ నెట్టింట పరువు నిలువునా పోగొట్టుకుంటున్నారు. అవకాశం లేకపోయినా కూడా భారత్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రతిసారి బొక్కబోర్లా పడి తమ పరువును నిలువునా పోగొట్టుకుంటున్నారు. అసలు పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో చేసిన ప్రదర్శన చూస్తే.. ఆడిన 9 మ్యాచుల్లో కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి జట్ల చేతిలోనే కాకుండా.. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లాంటి జట్ల చేతిలో కూడా పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. వారికి ఎంతో చక్కని ఆతిథ్యం ఇచ్చినా కూడా వాళ్లు మాత్రం మనపై విషమే కక్కుతున్నారు. మరి.. టీమిండియా ప్రదర్శనపై పాక్ చూపిస్తున్న ద్వేషంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.