iDreamPost
android-app
ios-app

ధోని రుణం తీర్చుకున్న షమి.. మాహీ ఫ్యాన్స్ గర్వపడేలా చేశాడు!

  • Author singhj Published - 06:38 PM, Thu - 16 November 23

వన్డే వరల్డ్ కప్​లో సంచలన ప్రదర్శనలతో అందర్నీ షాక్​కు గురిచేస్తున్నాడు భారత స్పీడ్​స్టర్ మహ్మద్ షమి. నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ను చిత్తు చేయడంలో అతడిదే మెయిన్ రోల్.

వన్డే వరల్డ్ కప్​లో సంచలన ప్రదర్శనలతో అందర్నీ షాక్​కు గురిచేస్తున్నాడు భారత స్పీడ్​స్టర్ మహ్మద్ షమి. నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ను చిత్తు చేయడంలో అతడిదే మెయిన్ రోల్.

  • Author singhj Published - 06:38 PM, Thu - 16 November 23
ధోని రుణం తీర్చుకున్న షమి.. మాహీ ఫ్యాన్స్ గర్వపడేలా చేశాడు!

ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్-2023 వేటలో మరో అడుగు ముందుకేసింది భారత్. న్యూజిలాండ్​తో బుధవారం జరిగిన సెమీస్​ ఫైట్​లో 70 రన్స్ తేడాతో నెగ్గి ఫైనల్​కు దూసుకెళ్లింది. మెగా టోర్నీలో ఛాంపియన్​గా నిలవాలంటే ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే చాలు. సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగే సెకండ్ సెమీఫైనల్​లో నెగ్గిన టీమ్​తో టీమిండియా తుదిపోరులో తాడోపేడో తేల్చుకోనుంది. అయితే కివీస్​పై విజయం ఊరికే రాలేదు. గత వరల్డ్ కప్స్ రికార్డులు భయపెడుతున్న వేళ, ఫుల్ ప్రెజర్​లో భారత్ టీమ్ సత్తా చాటింది. న్యూజిలాండ్ ఆఖరి వరకు పోరాడినా అప్పటికే మ్యాచ్​ మన చేతుల్లోకి వచ్చేసింది. ఈ మ్యాచ్​లో బ్యాటింగ్​లోనూ మనోళ్లు కుమ్మేశారు.

టాస్ నెగ్గి బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (29 బంతుల్లో 47), శుబ్​మన్ గిల్ (66 బంతుల్లో 80) అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా హిట్​మ్యాన్ కివీస్ టాప్ బౌలర్లైన ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీని టార్గెట్ చేసుకొని హిట్టింగ్​కు దిగాడు. గిల్ కూడా అడపాదడపా బౌండరీలు బాదడంతో స్కోరు 8 ఓవర్లలోనే 70 రన్స్​కు చేరుకుంది. ఆ తర్వాత రోహిత్ పెవిలియన్​కు చేరుకున్నా.. విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117), శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105) సెంచరీలతో దుమ్మురేపారు. అయ్యర్ అయితే మెరుపు బ్యాటింగ్​తో న్యూజిలాండ్​కు చుక్కలు చూపించాడు.

కింగ్ కోహ్లీ ఒక ఎండ్​లో పాతుకుపోగా.. అయ్యర్ మరో ఎండ్​లో భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39) కూడా బౌండరీలు, సిక్సులు బాదడంతో టీమ్ 397 రన్స్ చేసింది. ఇక ఛేజింగ్​కు దిగిన న్యూజిలాండ్​ను వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఒంటిచేత్తో కుప్పకూల్చాడు. ఏడుగురు కివీస్ బ్యాటర్లను అతనొక్కడే ఔట్ చేశాడు. దీన్ని బట్టే మ్యాచ్​లో అతడి బౌలింగ్ ఏ రేంజ్​లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. కేన్ విలియమ్సన్ (73 బంతుల్లో 69), డారిల్ మిచెల్ (119 బంతుల్లో 134) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కివీస్ ఛేజ్ చేసేస్తుందేమోనని అనిపించింది. కానీ వీళ్లిద్దర్నీ షమీనే పెవిలియన్​కు పంపాడు.

ఏడు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో ఈ పేసర్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడీ పేసర్. ధోని సపోర్ట్​తో జట్టులో ప్లేస్​ను ఫిక్స్ చేసుకున్నాడు. అప్పట్లో మాహీ పెట్టుకున్న నమ్మకం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాడు షమి. ధోని తర్వాత కెప్టెన్సీ చేసిన కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ కూడా ఈ సీనియర్ బౌలర్​కు అండగా ఉన్నారు.

ఏ ప్లేయర్​కైనా తన ఫస్ట్ కెప్టెన్ ముఖ్యం కాబట్టి షమి కెరీర్​లో ధోని రోల్​ను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి మాహీ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ వరల్డ్ కప్​లో రెచ్చిపోతున్నాడు షమి. నాకౌట్ మ్యాచ్​లో ఏడు వికెట్లు తీశాడతను. దీంతో ధోని ఫ్యాన్స్ అతడ్ని మెచ్చుకుంటున్నారు. మాహీ జెర్సీ నంబర్ 7.. షమి వికెట్ల సంఖ్య కూడా ఏడేనని.. తన తొలి కెప్టెన్ రుణాన్ని ఈ విధంగా తీర్చుకున్నాడని అంటున్నారు. మాహీ జెర్సీ నంబర్​కు సరిపోయేలా వికెట్లు తీయడమే గాక టీమిండియాను ఫైనల్​కు చేర్చాడని.. అందర్నీ గర్వపడేలా చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. షమి పెర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సొంత ఊరులో ధోని సందడి.. మహిళ పాదాలకు నమస్కారం..