న్యూజిలాండ్​కు భారీ షాక్.. వరల్డ్ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్!

  • Author singhj Published - 03:14 PM, Fri - 3 November 23

వరల్డ్ కప్-2023 ఫస్టాఫ్​లో చెలరేగి ఆడుతూ వరుస విజయాలు సాధించింది న్యూజిలాండ్. అయితే సెకండాఫ్​లో మాత్రం వరుస ఓటములతో ఆ టీమ్ డీలాపడింది. ఈ టైమ్​లో కివీస్​కు బిగ్ షాక్ తగిలింది.

వరల్డ్ కప్-2023 ఫస్టాఫ్​లో చెలరేగి ఆడుతూ వరుస విజయాలు సాధించింది న్యూజిలాండ్. అయితే సెకండాఫ్​లో మాత్రం వరుస ఓటములతో ఆ టీమ్ డీలాపడింది. ఈ టైమ్​లో కివీస్​కు బిగ్ షాక్ తగిలింది.

  • Author singhj Published - 03:14 PM, Fri - 3 November 23

వన్డే వరల్డ్ కప్-2023లో అండర్​డాగ్స్​గా బరిలోకి దిగిన టీమ్స్​లో న్యూజిలాండ్ ఒకటి. ఈ టీమ్ సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు అంతంతే అని మెగా టోర్నీ ఆరంభానికి చాలా మంది అనలిస్టులు అంచనా వేశారు. అయితే వాళ్ల అభిప్రాయాలు, ఎక్స్​పెక్టేషన్స్​ను తారుమారు చేస్తూ ఫస్టాఫ్​లో వరుసగా విజయాలు సాధించింది కివీస్. ఆడిన తొలి నాలుగు మ్యాచుల్లోనూ నెగ్గింది. అయితే ఆ తర్వాత నుంచి కివీస్​కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఎంతో ఆసక్తి రేకెత్తించిన మ్యాచ్​లో టీమిండియా చేతుల్లో ఓడింది న్యూజిలాండ్. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై ఆఖరి బాల్​కు మ్యాచ్​ను చేజార్చుకుంది. సౌతాఫ్రికాతో మ్యాచ్​లోనైతే చిత్తుగా ఓడిపోయింది.

మెగా టోర్నీ ఫస్టాఫ్​లో వరుస విజయాలతో దూసుకొచ్చిన న్యూజిలాండ్.. ఈజీగా సెమీఫైనల్ బెర్త్​ను ఖాయం చేసుకుంటుందని అంతా అనున్నారు. కానీ ఇప్పుడు వరుస పరాజయాలు ఆ టీమ్​ను వెంటాడుతున్నాయి. సెమీస్​కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైమ్​లో కివీస్​కు భారీ షాక్ తగిలింది. ఇంజ్యురీ వల్ల స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ టీమ్​కు దూరం అయ్యాడు. గాయం వల్ల వరల్డ్ కప్ నుంచి ఈ కీలక పేసర్ వైదొలిగాడు. హెన్రీకి హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యురీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పట్లో అతడు కోలుకునే అవకాశం లేదని సమాచారం. అందుకే టోర్నీ నుంచి తప్పుకోవాలని హెన్రీ డిసైడ్ అయ్యాడట.

ఇంజ్యురీ కారణంగా దూరమైన మ్యాట్ హెన్రీ ప్లేసులో కైల్ జెమీసన్​ను టీమ్​లోకి తీసుకుంది న్యూజిలాండ్. జెమీసన్​ను తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. మెగా టోర్నీలో మిగిలిన మ్యాచుల్లో హెన్రీకి బదులుగా జెమీసన్ ఆడతాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. హెన్రీ త్వరలోనే రికవర్ అయి కమ్​బ్యాక్ ఇస్తాడని ఆశిస్తున్నామని తెలిపింది. ఇక, ఆసీస్, సఫారీ టీమ్స్​ చేతుల్లో ఓడిన కివీస్​కు నెక్స్ట్ పాకిస్థాన్​తో జరిగే మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్​లో నెగ్గిన టీమ్ పాయింట్స్ టేబుల్​లో తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్​ ఒకరకంగా రెండు టీమ్స్​కు చావోరేవో అనే చెప్పాలి. మరి.. కీలక టైమ్​లో కివీస్​ పేసర్ మ్యాట్ హెన్రీ దూరమవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ-రోహిత్‌ శర్మ మైండ్‌సెట్‌ గురించి గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Show comments