మరో రెండు నెలల్లో భారత్ వేదికగా 2023 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ విశ్వసమరానికి అన్ని ఏర్పాట్లను చేస్తోంది బీసీసీఐ. ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీని అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ తో క్రికెట్ ఫ్యాన్స్ లో ఉత్సాహం మెుదలైంది. వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ కంటే ఎక్కువ ఆసక్తి కలిగించే మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది ఇండియా-పాక్ మ్యాచే. కాగా వరల్డ్ కప్ లో దాయాదుల సమరం అక్టోబర్ 15న జరగనున్నట్లు విడుదలైన షెడ్యూల్ లో ఉంది. కానీ ఈ మ్యాచ్ ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 14నే జరగనుంది. ఇందుకు పాకిస్తాన్ బోర్డ్ సైతం అంగీకారం తెలిపింది. మ్యాచ్ ఒకరోజు ముందుగానే జరగడానికి కారణం ఏంటంటే?
వన్డే ప్రపంచ కప్ 2023లో ఫేవరెట్ మ్యాచ్ ఏదంటే? కచ్చితంగా ఇండియా-పాక్ మ్యాచే అని చెబుతారు అందరు. అయితే ఇంతటి క్రేజ్ కలిగిన మ్యాచ్ తేదీ మార్పునకు రంగం సిద్దమైంది. భారత్-పాక్ మధ్య అక్టోబర్ 15న(గుజరాత్, అహ్మదాబాద్)లో మ్యాచ్ జరగనుంది. కానీ అదేరోజున గుజరాత్ లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దాంతో భద్రతా కారణాలు తలెత్తుతాయి అని రాష్ట్ర సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి వినతిచేశాయి. దాంతో బీసీసీఐ కూడా ఆలోచించి ఐసీసీకి ప్రతిపాదనలు పంపింది.
అయితే మ్యాచ్ ను ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 14న నిర్వహించేందుకు పాకిస్తాన్ బోర్డ్ కూడా అంగీకారం తెలిపింది. దీంతో ఐసీసీ కూడా షెడ్యూల్ మార్చేందుకు ఆమోదముద్ర వేసింది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అక్టోబర్ 15నుంచే మెుదలు కావడం.. అదే రోజు గుజరాత్ లో అత్యంత ప్రత్యేకమైన గర్భా వేడుకలు జరగనున్నాయి. ఇక ఇదే రోజు ఇండియా-పాక్ లాంటి హై ప్రొఫైల్ మ్యాచ్ నిర్వహించడం గుజరాత్ పోలీసులకు కష్టంతో కూడుకున్న పని. అందుకే ఈ మ్యాచ్ ను ఒకరోజు ముందుగానే నిర్వహించడానికి, తేదీని మార్చమని రాష్ట్ర పోలీస్ సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐని కోరాయి. కాగా.. అప్డేటెడ్ షెడ్యూల్ ను ఐసీసీ త్వరలోనే విడుదల చేయనుంది.
Pakistan’s re-scheduled matches in World Cup 2023 [RevSportz]:
Oct 6 – PAK vs NED in Hyderabad.
Oct 10 – PAK vs SL in Hyderabad.
Oct 14 – PAK vs IND in Ahmedabad. pic.twitter.com/v9Yk6r9jx1— Johns. (@CricCrazyJohns) August 1, 2023
ఇదికూడా చదవండి: 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 27 సంవత్సరాల రికార్డు బ్రేక్ చేసిన ఉనద్కత్