iDreamPost
android-app
ios-app

అయ్యర్ ని ఇమిటేట్ చేసిన రోహిత్.. వైరల్ వీడియో!

తొలి సెమీ పైనల్ లో ఘన విజయం సాధించి టీమిండియా.. ఫైనల్ చేరింది. అయితే ఈ మ్యాచ్ లో అందరూ సమష్టి కృషితో టీమిండియాకి విజయాన్ని అందించారు.

తొలి సెమీ పైనల్ లో ఘన విజయం సాధించి టీమిండియా.. ఫైనల్ చేరింది. అయితే ఈ మ్యాచ్ లో అందరూ సమష్టి కృషితో టీమిండియాకి విజయాన్ని అందించారు.

అయ్యర్ ని ఇమిటేట్ చేసిన రోహిత్.. వైరల్ వీడియో!

వరల్డ్ కప్ 2023తో భారత్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఒక వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా పదికి పది మ్యాచులు గెలిచి టీమిండియా రికార్డులు సృష్టించింది. ప్రతి ఒక్కరు జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. బ్యాటింగ్ విభాగం మొత్తం అత్యధిక పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తే.. బౌలర్లు కివీస్ తమ లక్ష్యాన్ని చేరుకోకుండా కట్టుదిట్టం చేశారు. మొత్తానికి 70 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ ను ముద్దాడేందుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. నవంబర్ 19న అహ్మదాబాద్ లో విజయకేతనం ఎగరేస్తే కప్పు మనదే. అయితే కివీస్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో క్రెడిట్ అయ్యర్ కి కూడా ఇవ్వాలి. నిజానికి భారత్ విజయం వెనుక కీలకపాత్ర పోషించి అయ్యర్ అనే చెప్పాలి.

టీమిండియా ఘన విజయం నమోదు చేసింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయాస్ అయ్యర్(105) శతకాలతో చెలరేగారు. షమీ 7 వికెట్లు తీశాడు. అందరూ కూడా కోహ్లీ, షమీ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు అంటున్నారు. నిజానికి అది నిజమే కానీ.. వీళ్ల కంటే కూడా శ్రేయాస్ అయ్యర్ ఒకింత ఎక్కువ కంట్రిబ్యూట్ చేశాడు. అయ్యర్ నిన్న మ్యాచ్ లో ఎంతో వేగంగా ఆడాడు. కేవలం 70 బంతుల్లోనే 8 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. నాకౌట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ని చూస్తే ఒకానొక సమయంలో టీమిండియా అభిమానులకు కంగారొచ్చింది. మ్యాచ్ చేజారిపోతుందనే అభిప్రాయం ఏర్పడింది. కానీ, షమీ అటాకింగ్ తో ఆ ప్రమాదం తప్పింది. అయితే ఇక్కడ శ్రేయాస్ అయ్యర్ చేసిన గొప్ప పని ఏంటంటే.. అత్యంత వేగంగా పరుగులు చేయడం. కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించడం. అతను అలా చేయబట్టే టీమిండియాకి మంచి స్కోర్ దక్కింది. అయ్యర్ గనుక స్లోగా ఆడుంటే భారత్ ఇంత మంచి స్కోర్ చేయగలిగేది కాదేమో? ఒకవేళ అయ్యర్ చాలా తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరుంటే మ్యాచ్ ఫలితం రివర్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

అయ్యర్ ని పొగిడే ముందు కెప్టెన్ రోహిత్ శర్మాని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక ఆటగాడి కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజం. ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాలని లేదు. కెరీర్ మొత్తం సజావుగా సాగుతుందని కూడా గ్యారెంటీ లేదు. అలాంటి ఒక డౌన్ ఫాల్ ని అయ్యర్ చూశాడు. అలాంటి సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అతనికి బాసటగా నిలిచాడు. అయ్యర్ ని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఎంతమంది అయ్యర్ టాలెంట్ ని శంకించినా కూడా రోహిత్ మాత్రం అతడికి మద్దతు తెలిపాడు. అలా రోహిత్ చూపించిన నమ్మకమే ఇలా నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా విజయానికి బాటలు వేసింది. అంతేకాకుండా మ్యాచ్ లో ఇంకో ఫన్నీ విషయం కూడా జరిగింది. సెంచరీ చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడో అచ్చు అలాగే రోహిత్ శర్మ ఇమిటేట్ చేశాడు. అయ్యర్ ని ఇమిటేట్ చేస్తూ రోహిత్ నడిచిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. శ్రేయాస్ అయ్యర్ సాధించిన ఈ అత్యంత వేగవంతమైన శతకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nowheylifts (@nowheylifts)