Hardik Pandya Out Team India In Tension: ICC టోర్నీల్లో భారత్​కు శాపంగా మారిన గాయాలు.. హార్దిక్​దే ఫస్ట్ కాదు..!

ICC టోర్నీల్లో భారత్​కు శాపంగా మారిన గాయాలు.. హార్దిక్​దే ఫస్ట్ కాదు..!

  • Author singhj Updated - 04:44 PM, Sat - 4 November 23

ఐసీసీ టోర్నీల్లో గాయలు భారత్​కు శాపంగా మారుతున్నాయి. ఇంజ్యురీల వల్ల ట్రోఫీలను చేజార్చుకుంటోంది టీమిండియా. తాజాగా హార్దిక్ పాండ్యా గాయంతో మళ్లీ ఏం అవుతుందోనని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

ఐసీసీ టోర్నీల్లో గాయలు భారత్​కు శాపంగా మారుతున్నాయి. ఇంజ్యురీల వల్ల ట్రోఫీలను చేజార్చుకుంటోంది టీమిండియా. తాజాగా హార్దిక్ పాండ్యా గాయంతో మళ్లీ ఏం అవుతుందోనని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

  • Author singhj Updated - 04:44 PM, Sat - 4 November 23

వన్డే వరల్డ్ కప్-2023లో ఫస్ట్ ప్లేసులో కొనసాగుతున్న టీమిండియా ఫ్యాన్స్​కు షాకింగ్ న్యూస్. ఇంజ్యురీ కారణంగా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మెగా టోర్నీకి దూరమైనట్లు ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో బౌలింగ్ టైమ్​లో బాల్​ను ఆపే క్రమంలో హార్దిక్ పాండ్యా కిందపడ్డాడు. చీలమండ గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ)కు వెళ్లిపోయాడు. అయితే తొలుత మూడు మ్యాచులకు అతడు దూరమవుతాడని మేనేజ్​మెంట్ చెప్పింది. కానీ గాయం తీవ్రత ఎక్కువవడంతో అతడికి రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో వరల్డ్ కప్​ నుంచి హార్దిక్​ను పూర్తిగా తప్పించింది. అతడి ప్లేస్​లో యంగ్ పేసర్ ప్రసిధ్ కృష్ణను భారత మేనేజ్​మెంట్ భర్తీ చేసింది.

బ్యాలెన్స్ తప్పినట్లే!

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో కేవలం మూడు బాల్స్ మాత్రమే వేశాడు హార్దిక్ పాండ్యా. అంతకుముందు ఆడిన మూడు మ్యాచుల్లో మాత్రం ఐదు వికెట్లు తీశాడు. ఆ మ్యాచుల్లో అతడికి ఒకేసారి బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అందులోనూ 11 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు మ్యాచుల్లోనూ విజయాలతో పాయింట్స్ టేబుల్​లో (14) ఫస్ట్ ప్లేస్​లో ఉంది. ఇప్పటికే సెమీస్ బెర్త్​ను ఖరారు చేసుకున్న రోహిత్ సేనకు పాండ్యా దూరమవ్వడం గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. లీగ్ దశలో ఆడాల్సిన రెండు మ్యాచ్​లను వదిలేస్తే సెమీఫైనల్, ఫైనల్ లాంటి బిగ్ మ్యాచ్​లకు హార్దిక్ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా చెప్పొచ్చు.

రోహిత్​కు కొత్త తలనొప్పి!

బ్యాట్​తో పాటు బంతితోనూ రాణించే హార్దిక్ టీమ్​లో మంచి బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. మెయిన్ బౌలర్లకు వికెట్లు పడనప్పుడు అతడు వచ్చి బ్రేక్ త్రూ ఇచ్చేవాడు. అలాగే ఆరేడు ఓవర్లు వేసి ప్రధాన బౌలర్లకు కాస్త రెస్ట్ ఇచ్చేవాడు. రన్స్ ఆపడంతో పాటు వికెట్లు తీస్తూ ప్రెజర్ తగ్గించేవాడు. ఫీల్డింగ్​లో కూడా విలువైన రన్స్ కాపాడటమే గాక బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచులతో ప్రత్యర్థి బ్యాటర్లను వెనక్కి పంపేవాడు. సిచ్యువేషన్​కు తగ్గట్లు బ్యాటింగ్ చేసే పాండ్యా.. కావాలంటే మెళ్లిగా రన్స్ చేయగలడు, అవసరమైతే ఫోర్లు, సిక్సులతో డామినేట్ చేయగలడు. ఆఖర్లో వచ్చి మ్యాచ్​లు ముగించే పాండ్యా లాంటి ఫినిషర్ లేకపోవడం రోహిత్ సేనను పెద్ద మ్యాచుల్లో ఇబ్బంది పెట్టక తప్పదు.

మేనేజ్​మెంట్ ఏం చేస్తుందో?

హార్దిక్ టీమ్​లో ఉంటే ఎక్స్​ట్రా పేసర్ లేదా స్పిన్నర్​ను తీసుకునేందుకు టీమ్ మేనేజ్​మెంట్​కు ఛాన్స్ ఉండేది. పాండ్యా వల్ల ముగ్గురు పేసర్లు లేదా ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ ట్రై చేసేందుకు కెప్టెన్ రోహిత్​ శర్మకు ఛాన్స్ ఉండేది. పిచ్​ను బట్టి పేస్​కు అనుకూలిస్తే అదనపు పేసర్​ను, స్పిన్​కు అనుకూలిస్తే ఎక్స్​ట్రా స్పిన్నర్​ను ఆడించేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు అతడు లేకపోవడంతో ఆ బ్యాలెన్స్ తప్పింది. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో వెళ్లాల్సిన పరిస్థితి. ఆల్​రౌండర్ జడేజా ఉండటంతో ఐదుగురు బౌలర్లు అవుతారు. వీళ్లలో ఎవర్నైనా ప్రత్యర్థి బ్యాటర్లు టార్గెట్ చేసుకుంటే లేదా ఎవరైనా భారీగా రన్స్ ఇస్తే.. కెప్టెన్ రోహిత్​కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని హిట్​మ్యాన్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.

ఇదేం కొత్త కాదు!

ఐసీసీ టోర్నీల్లో భారత టాప్ ప్లేయర్లకు గాయాలవ్వడం, ఇంజ్యురీల వల్ల వాళ్లు దూరమవ్వడం ఇది కొత్తేమీ కాదు. ఒక్క హార్దికే కాదు గతంలోనూ కొందరు ఆటగాళ్లు ఇలాగే గాయాల వల్ల టీమ్​కు దూరమవ్వడంతో మెయిన్ మ్యాచుల్లో ఓడి టీమిండియా కప్పులు చేజార్చుకుంది. ఒకరకంగా చెప్పాలంటే గాయాలు భారత్​కు చాలా కప్పులు చేజార్చాయి. ఇంజ్యురీలు మన టీమ్​కు శాపంగా మారుతున్నాయి. 2020 టీ20 వరల్డ్ కప్​లో బుమ్రా, జడేజాలు గాయాలతో టోర్నీ నుంచి దూరమయ్యారు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​లో బుమ్రాతో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్​లు ఇంజ్యురీలతో టోర్నీ నుంచి వైదొలిగారు. ఈ ఎఫెక్ట్ భారత్ ఆడిన మిగిలిన మ్యాచ్​లపై పడింది. సరైన్ రీప్లేస్​మెంట్​ లేకపోవడం, బ్యాలెన్స్ తప్పడంతో టీమిండియా ఓడిపోయింది. మరి.. భారత్​కు గాయాలు శాపాలుగా మారడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘానిస్థాన్! మెగా టోర్నీకి క్వాలిఫై.. మరి ఆ టీమ్‌ సంగతేంటి?

Show comments