ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ చేసిన ఒక పని నెట్టింట వైరల్ అవుతోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అంపైర్ దగ్గరకు వెళ్లి వోక్స్ చేసిన ఓ పనితో బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ పరువు పోయింది.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ చేసిన ఒక పని నెట్టింట వైరల్ అవుతోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అంపైర్ దగ్గరకు వెళ్లి వోక్స్ చేసిన ఓ పనితో బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ పరువు పోయింది.
‘టైమ్డ్ ఔట్’.. ప్రస్తుత క్రికెట్ వరల్డ్‌లో బాగా వినిపిస్తున్న పదం. ఇంతకుముందు వరకు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. క్రికెట్ అభిమానులకు పక్కన పెడితే ప్లేయర్లలో కూడా చాలా మందికి ఈ రూల్ తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వన్డే వరల్డ్ కప్-2023లో బంగ్లాదేశ్-శ్రీలంక పుణ్యమా అని ఈ నిబంధన ఇప్పుడు న్యూస్‌లో బాగా నలుగుతున్న అంశంగా మారింది. బంగ్లా-లంక మ్యాచ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను అంపైర్లు టైమ్డ్ ఔట్‌గా ప్రకటించడం పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఒక్క బాల్ కూడా ఆడకుండానే లంక క్రికెటర్ పెవిలియన్‌కు చేరుకోవడం క్రికెట్ దునియాలో పెద్ద దుమారమే రేపింది. ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో ఒక ఆటగాడు ఇలా ఔటవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.
జెంటిల్మన్ గేమ్ రూల్స్ ప్రకారం.. ఒక బ్యాట్స్‌మన్ గనుక అవుటైతే.. ఆ తర్వాత వచ్చే బ్యాటర్ మూడు నిమిషాల్లోగా సిద్ధంగా ఉండాలి. ప్రపంచ కప్‌లో ఈ నిబంధనను రెండు నిమిషాలకు కుదించారు. అయితే బంగ్లాతో మ్యాచ్‌లో ఏంజెలో మాథ్యూస్ సరిగా టైమ్‌లోకి క్రీజులోకి వచ్చాడు. కానీ అప్పుడే అతని హెల్మెట్‌కు ఉన్న స్ట్రాప్ తెగిపోయింది. దీంతో వేరే హెల్మెట్ తెప్పించుకున్నాడు మాథ్యూస్. ఆ హెల్మెట్ వచ్చే సరికి సమయం అయిపోయింది. బ్యాటర్‌ను ఔట్‌గా ఇవ్వాలంటూ ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్ల దగ్గరకు వెళ్లి అప్పీల్ చేశాడు. అప్పీల్‌తో షాక్‌కు గురైన అంపైర్లు.. సీరియస్‌గానే అడుగుతున్నావా? అని షకీబ్‌ను క్వశ్చన్ చేశారు. రూల్ ఉంది కాబట్టే తాను అప్పీల్ చేస్తున్నానని బంగ్లా సారథి అనడంతో అంపైర్లు ఔట్ ఇవ్వక తప్పలేదు.
ఏం జరుగుతుందో అర్థం కాని మాథ్యూస్.. షకీబ్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని అతడ్ని కోరాడు. అప్పీల్ వెనక్కి తీసుకోవాలని మాథ్యూస్ కోరినా షకీబ్ తన డెసిజన్ను మార్చుకోలేదు. దీంతో నిరాశ, కోపంతో క్రీజును వదిలాడు మాథ్యూస్. ఈ కాంట్రవర్సీ ఇంకా కంటిన్యూ అవుతోంది. షకీబ్‌ను సీనియర్ క్రికెటర్స్‌తో పాటు క్రికెట్ అభిమానులూ విమర్శిస్తున్నారు. ఈ టైమ్‌లో వరల్డ్ కప్‌లో మరో టైమ్డ్ ఔట్ రిపీట్ అయ్యేదే. ఇంగ్లండ్-నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ కొంచెంలో టైమ్డ్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. బ్యాటింగ్‌కు వచ్చిన టైమ్‌లో తన హెల్మెట్‌లో ఏదో లోపం ఉన్నట్లు గ్రహించాడు వోక్స్. అయితే తనను కూడా ఔట్ ఇస్తారేమోననే భయంతో వెంటనే అంపైర్ల దగ్గరకు వెళ్లాడు.
హెల్మెట్‌లో ఉన్న సమస్యను అంపైర్లకు చూపించాడు క్రిస్ వోక్స్. అంపైర్ల పర్మిషన్తో మరో హెల్మెట్ తెప్పించుకున్నాడు. వోక్స్ అంపైర్లతో మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ షకీబ్ పరువును వోక్స్ తీశాడని అంటున్నారు. కావాలనే ఇంకెంత టైమ్ ఉందని అంపైర్లను అడగడం ద్వారా షకీబ్‌ను అతడు అవమానించాడని చెబుతున్నారు. అంపైర్లతో నవ్వుతూ మాట్లాడుతూ, హెల్మెట్‌ను చూపించడం ద్వారా షకీబ్‌ను రెచ్చగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్ ఏమో ఔట్ కాకుండా ఉండేందుకు అతడు జాగ్రత్త పడ్డాడని అంటున్నారు. మరి.. టైమ్ ఔట్ నుంచి వోక్స్ తప్పించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా పేసర్ల సక్సెస్ వెనుక బౌలింగ్ కోచ్ మాంబ్రే! అతను ఆడింది 5 మ్యాచ్‌లే
Chris Woakes takes a cheeky dig at Shakib by asking the umpire how much time is left while adjusting his helmet 😅#CricketTwitter #CWC23 pic.twitter.com/ilDOik7cCp
— InsideSport (@InsideSportIND) November 8, 2023