iDreamPost
android-app
ios-app

బంగ్లా కెప్టెన్ షకీబ్ పరువు తీసిన క్రిస్ వోక్స్.. అంపైర్ దగ్గరకు వెళ్లి..!

  • Author singhj Published - 11:17 AM, Thu - 9 November 23

ఇంగ్లండ్ ఆల్​రౌండర్ క్రిస్ వోక్స్ చేసిన ఒక పని నెట్టింట వైర​ల్ అవుతోంది. నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో అంపైర్ దగ్గరకు వెళ్లి వోక్స్ చేసిన ఓ పనితో బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ పరువు పోయింది.

ఇంగ్లండ్ ఆల్​రౌండర్ క్రిస్ వోక్స్ చేసిన ఒక పని నెట్టింట వైర​ల్ అవుతోంది. నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో అంపైర్ దగ్గరకు వెళ్లి వోక్స్ చేసిన ఓ పనితో బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ పరువు పోయింది.

  • Author singhj Published - 11:17 AM, Thu - 9 November 23
బంగ్లా కెప్టెన్ షకీబ్ పరువు తీసిన క్రిస్ వోక్స్.. అంపైర్ దగ్గరకు వెళ్లి..!

‘టైమ్డ్ ఔట్’.. ప్రస్తుత క్రికెట్​ వరల్డ్​లో బాగా వినిపిస్తున్న పదం. ఇంతకుముందు వరకు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. క్రికెట్ అభిమానులకు పక్కన పెడితే ప్లేయర్లలో కూడా చాలా మందికి ఈ రూల్ తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వన్డే వరల్డ్ కప్​-2023లో బంగ్లాదేశ్-శ్రీలంక పుణ్యమా అని ఈ నిబంధన ఇప్పుడు న్యూస్​లో బాగా నలుగుతున్న అంశంగా మారింది. బంగ్లా-లంక మ్యాచ్​లో సీనియర్ ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్​ను అంపైర్లు టైమ్డ్ ఔట్​గా ప్రకటించడం పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఒక్క బాల్​ కూడా ఆడకుండానే లంక క్రికెటర్ పెవిలియన్​కు చేరుకోవడం క్రికెట్ దునియాలో పెద్ద దుమారమే రేపింది. ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో ఒక ఆటగాడు ఇలా ఔటవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.

జెంటిల్మన్ గేమ్ రూల్స్ ప్రకారం.. ఒక బ్యాట్స్​మన్ గనుక అవుటైతే.. ఆ తర్వాత వచ్చే బ్యాటర్ మూడు నిమిషాల్లోగా సిద్ధంగా ఉండాలి. ప్రపంచ కప్​లో ఈ నిబంధనను రెండు నిమిషాలకు కుదించారు. అయితే బంగ్లాతో మ్యాచ్​లో ఏంజెలో మాథ్యూస్ సరిగా టైమ్​లోకి క్రీజులోకి వచ్చాడు. కానీ అప్పుడే అతని హెల్మెట్​కు ఉన్న స్ట్రాప్ తెగిపోయింది. దీంతో వేరే హెల్మెట్ తెప్పించుకున్నాడు మాథ్యూస్. ఆ హెల్మెట్ వచ్చే సరికి సమయం అయిపోయింది. బ్యాటర్​ను ఔట్​గా ఇవ్వాలంటూ ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్ల దగ్గరకు వెళ్లి అప్పీల్ చేశాడు. అప్పీల్​తో షాక్​కు గురైన అంపైర్లు.. సీరియస్​గానే అడుగుతున్నావా? అని షకీబ్​ను క్వశ్చన్ చేశారు. రూల్ ఉంది కాబట్టే తాను అప్పీల్ చేస్తున్నానని బంగ్లా సారథి అనడంతో అంపైర్లు ఔట్ ఇవ్వక తప్పలేదు.

ఏం జరుగుతుందో అర్థం కాని మాథ్యూస్.. షకీబ్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. అప్పీల్​ను వెనక్కి తీసుకోవాలని అతడ్ని కోరాడు. అప్పీల్ వెనక్కి తీసుకోవాలని మాథ్యూస్ కోరినా షకీబ్ తన డెసిజన్​ను మార్చుకోలేదు. దీంతో నిరాశ, కోపంతో క్రీజును వదిలాడు మాథ్యూస్. ఈ కాంట్రవర్సీ ఇంకా కంటిన్యూ అవుతోంది. షకీబ్​ను సీనియర్ క్రికెటర్స్​తో పాటు క్రికెట్ అభిమానులూ విమర్శిస్తున్నారు. ఈ టైమ్​లో వరల్డ్ కప్​లో మరో టైమ్డ్ ఔట్ రిపీట్ అయ్యేదే. ఇంగ్లండ్-నెదర్లాండ్స్ మ్యాచ్​లో ఆల్​రౌండర్ క్రిస్ వోక్స్ కొంచెంలో టైమ్డ్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. బ్యాటింగ్​కు వచ్చిన టైమ్​లో తన హెల్మెట్​లో ఏదో లోపం ఉన్నట్లు గ్రహించాడు వోక్స్. అయితే తనను కూడా ఔట్ ఇస్తారేమోననే భయంతో వెంటనే అంపైర్ల దగ్గరకు వెళ్లాడు.

హెల్మెట్​లో ఉన్న సమస్యను అంపైర్లకు చూపించాడు క్రిస్ వోక్స్. అంపైర్ల పర్మిషన్​తో మరో హెల్మెట్ తెప్పించుకున్నాడు. వోక్స్​ అంపైర్లతో మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ షకీబ్ పరువును వోక్స్ తీశాడని అంటున్నారు. కావాలనే ఇంకెంత టైమ్ ఉందని అంపైర్లను అడగడం ద్వారా షకీబ్​ను అతడు అవమానించాడని చెబుతున్నారు. అంపైర్లతో నవ్వుతూ మాట్లాడుతూ, హెల్మెట్​ను చూపించడం ద్వారా షకీబ్​ను రెచ్చగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్‌ ఏమో ఔట్ కాకుండా ఉండేందుకు అతడు జాగ్రత్త పడ్డాడని అంటున్నారు. మరి.. టైమ్ ఔట్ నుంచి వోక్స్ తప్పించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా పేసర్ల సక్సెస్‌ వెనుక బౌలింగ్‌ కోచ్‌ మాంబ్రే! అతను ఆడింది 5 మ్యాచ్‌లే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి