iDreamPost
android-app
ios-app

మ్యాక్స్‌వెల్‌ విధ్వంసంపై జక్కన్న పోస్ట్‌ వైరల్‌.. మ్యాడ్‌ అంటూ

  • Published Nov 08, 2023 | 9:32 AM Updated Updated Nov 08, 2023 | 10:52 AM

91 పరుగులకే 7 వికెట్లు.. ఇక పసికూన చేతిలో ఓటమి తప్పదనుకున్న దశలో క్రీజులోకి వచ్చి చెలరేగి పోయి.. ఆసీస్‌కు మరపురాని విజయం అందించాడు మ్యాక్స్‌వెల్‌. అతడి విరోచిత ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో రాజమౌళి చేసిన పోస్ట్‌ వైరలవుతోంది. ఆ వివరాలు..

91 పరుగులకే 7 వికెట్లు.. ఇక పసికూన చేతిలో ఓటమి తప్పదనుకున్న దశలో క్రీజులోకి వచ్చి చెలరేగి పోయి.. ఆసీస్‌కు మరపురాని విజయం అందించాడు మ్యాక్స్‌వెల్‌. అతడి విరోచిత ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో రాజమౌళి చేసిన పోస్ట్‌ వైరలవుతోంది. ఆ వివరాలు..

  • Published Nov 08, 2023 | 9:32 AMUpdated Nov 08, 2023 | 10:52 AM
మ్యాక్స్‌వెల్‌ విధ్వంసంపై జక్కన్న పోస్ట్‌ వైరల్‌.. మ్యాడ్‌ అంటూ

వరల్డ్‌ కప్‌ 2023 ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు ఒక ఎత్తైతే.. మంగళవారం నాడు జరిగిన మ్యాచ్‌ మరో ఎత్తు. పసికూన చేతిలో.. ఆసీస్‌ ఓటమి ఇక ఖాయం అనుకున్న తరుణంలో బరిలోకి దిగిన మ్యాక్‌వెల్‌.. ఒక్కసారిగా పరిస్థితిని పూర్తిగా తలకిందులు చేశాడు. వాంఖడే వేదికగా.. క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌ క్రికెట్‌ హిస్టరీలోనే.. చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. పాపం మ్యాక్స్‌వెల్‌ ఊచకోత ముందు అఫ్గాన్‌ చిగురుటాకులా వణికిపోయింది. ఒకానొక దశలో అఫ్గాన్‌ ప్లేయర్లు కన్నీరు పెట్టుకునే పరిస్థితి. అవును మరి.. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి.. ఇక ఓటమి తప్పదన్న నిరాశలో ఉన్నారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చి మ్యాక్స్‌వెల్‌.. ప్యాట్‌ కమ్మిన్స్‌తో కలిసి అద్భుతం చేశాడు.

వరుసగా సిక్సులు, ఫోర్లు బాదుతూ 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం మ్యాచ్‌లో 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో చెలరేగి పోయి డబుల్ సెంచరీ చేయడమే కాక ఆసీస్‌కు మరపురాని.. అద్భుతమైన విజయాన్ని అందించాడు. సెమిస్‌ బెర్త్‌ను కన్ఫామ్‌ చేశాడు. ఇక మ్యాక్స్‌వెల్‌ విధ్వంసంపై ప్రపంచ క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సలాం యోధుడా అంటూ కీర్తిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకధీరుడు జక్కన్న మ్యాక్స్‌వెల్‌ ఊచకోత మీద చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. ఆవివరాలు..

మ్యాక్స్‌వెల్‌ విజయంపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. మ్యాక్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌ గురించి వర్ణిస్తూ.. మ్యాడ్‌ మ్యాక్స్‌ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు జక్కన్న. మ్యాక్స్ వెల్‌ పిచ్చెక్కించేలా ఆడాడని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక తాను చూసిన ఇన్నింగ్స్‌లో ఇది ఆల్‌టైం గ్రేట్‌ అంటూ ప్రశంసించారు రాజమౌళి. ప్రస్తుతం జక్కన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. సినిమాలతో పిచ్చెక్కించే జక్కన్నకే మ్యాక్స్‌ ఆట చూసి మ్యాడ్‌ అంటున్నాడంటే.. ఇక క్రికెట్‌ అభిమానుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

ఇక రాజమౌళి విషయానికి వస్తే.. ట్రిపుల్‌ ఆర్‌ మాసివ్‌ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆయన బ్రేక్‌ తీసుకున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో తెరకెక్కిచబోయే మూవీపై వర్క్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్‌ వర​్‌ మీదనే జక్కన్న ఫుల్‌ కాన్సన్‌ట్రేట్‌ చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ మూవీని తెరకెక్కించనున్నారు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet