శ్రీలంకతో మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు ఔటైన టైమ్‌లో అతియా శెట్టి ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
శ్రీలంకతో మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు ఔటైన టైమ్‌లో అతియా శెట్టి ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
టీమిండియా బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఏంటో మరోమారు తెలిసొచ్చింది. వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 50 ఓవర్లలో ఏకంగా 357 రన్స్ చేసింది. శుబ్‌మన్ గిల్ (92), విరాట్ కోహ్లీ (88), శ్రేయస్ అయ్యర్ (82) సూపర్బ్ నాక్స్‌తో టీమ్‌కు భారీ స్కోరును అందించారు. ఈ ముగ్గురు బ్యాటర్లు దురదృష్టం కొద్దీ సెంచరీలు చేయలేకపోయారు. కానీ ఉన్నంత సేపు తమ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు.
కెప్టెన్ రోహిత్ శర్మ (4) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. కానీ గిల్‌తో కలిసి కోహ్లీ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ లంక బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. గిల్, కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (21) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. సూర్యకుమార్ యాదవ్ (12) కూడా ఆకట్టుకోలేకపోయాడు. కానీ శ్రేయస్ అయ్యర్ (82), రవీంద్ర జడేజా (35) తమ బ్యాట్ పవర్ ఏంటో చూపించారు. ముఖ్యంగా అయ్యర్ అయితే వరుసగా సిక్సులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అయ్యర్ హిట్టింగ్ ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
శ్రేయస్ అయ్యర్ ఔటైనా జడేజా ఆఖరి వరకు క్రీజులో ఉండి టీమ్ భారీ స్కోరును చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఔటై వెళ్తున్న టైమ్‌లో స్టేడియంలో ఉన్న కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. అయ్యో అంటూ రెండు చేతుల్ని ముఖానికి అడ్డుగా పెట్టుకుంది అతియా. అయ్యర్ ఔట్‌కు అతియా ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. అతియా రియాక్షన్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శ్రీలంకపై టీమిండియా ఘనవిజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!
Athiya Shetty’s reaction to Shreyas Iyer’s wicket. pic.twitter.com/1zXbt6lBuV
— CricTracker (@Cricketracker) November 2, 2023