SNP
Shubman Gill vs Johny Bairstow: టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో బెయిర్‌స్టో గొడవకు దిగాడు. దీంతో.. ముగ్గురు యువ క్రికెటర్ల కలిసి.. బెయిర్ స్టోను దారుణంగా ర్యాగింగ్ చేశారు. పూర్తి వివరాలు వీడియోతో సహా ఉన్నాయి.
Shubman Gill vs Johny Bairstow: టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో బెయిర్‌స్టో గొడవకు దిగాడు. దీంతో.. ముగ్గురు యువ క్రికెటర్ల కలిసి.. బెయిర్ స్టోను దారుణంగా ర్యాగింగ్ చేశారు. పూర్తి వివరాలు వీడియోతో సహా ఉన్నాయి.
SNP
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 218 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోతున్నాం అనే బాధో ఏంటో తెలియదు కానీ.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో భారత కుర్రాళ్లపై నోరు పారేసుకున్నాడు. వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న బెయిర్ స్టో తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టుకుండా.. టీమిండియా యువ క్రికెటర్లు జురెల్, గిల్‌పై స్లెడ్జింగ్‌కు దిగాడు. అసలే ఊడుకు రక్తం, పైగా మ్యాచ్ గెలిచే పొజిషన్‌లో ఉన్నారు.. కుర్రాళ్లు ఊరుకుంటారా? సీనియర్ బ్యాటర్, వందో టెస్టు ఆడుతున్నాడని కూడా చూడకుండా.. తమను గెలికిన బెయిర్ స్టోకు ఇచ్చిపడేశాడు. ప్రస్తుతం బెయిర్ స్టో-గిల్ మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బెయిర్ స్టో బ్యాటింగ్‌కి వచ్చాడు. వచ్చీ రావడంతో భారీ షాట్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అప్పటికే మూడు వికెట్లు పడగొట్టి డేంజరస్‌గా మారిన అశ్విన్‌ను టార్గెట్‌గా చేసి ఓ మూడు సిక్సులు కొట్టాడు. అంతే.. ఇక తనను ఆపేవాళ్లు ఎవరులే అంటూ బ్యాట్‌తో పాటు నోటితో కూడా చెలరేగాడు. ముందు టీమిండియా యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ను ఏదో అన్న బెయిర్ స్టో.. తర్వాత గిల్‌ను గెలుకుతూ.. ‘జిమ్మి(జెమ్స్ అండర్సన్)ను ఏం అన్నావ్.. నిన్ను అవుట్ చేశాడు?’ అని వెటకారంగా అన్నాడు. దానికి గిల్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ‘సో వాట్.. అప్పటికే నేను సెంచరీ పూర్తి చేశా! అయినా నువ్వు ఎన్ని సెంచరీలు కొట్టావ్ ఇక్కడ’ అని బదులిచ్చాడు. ఈ సిరీస్‌లో బెయిర్ స్టో డిజాస్టర అయిన విషయం తెలిసిందే.
గిల్ ఇచ్చిన సమాధానంతో మళ్లీ నోరు తెరవలేదు బెయిర్ స్టో. అక్కడే షార్ట్ లెగ్‌లో నిల్చున్న టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా గిల్‌కు సపోర్ట్ చేస్తూ.. ‘వాడికి చెప్పు నోరు మూసుకోమని, కొన్ని రన్స్ చేశాడో లేదో ఎగిరెగిరి పడుతున్నాడు’ అంటూ హిందీలో అన్నాడు. ఇలా కుర్రాళ్లను గెలికి పరువుతీయించుకున్నాడు బెయిర్ స్టో. తన బ్యాటింగ్ ఏదో తాను చేసుకోకా.. గిల్‌ను ఎందుకు గెలకాల్సి వచ్చింది అంటూ క్రికెట్ అభిమానులు కూడా బెయిర్ స్టోనే తప్పుబడుతున్నాడు. ఈ మాట యుద్ధం తర్వాత అవుటైన బెయిర్ స్టో.. పెవిలియన్‌కు వెళ్తూ వెళ్తూ మళ్లీ గిల్‌ను ఏదో అన్నాడు. దాంతో గిల్ కూడా బెయిర్ స్టోను ఏదో అన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా బెయిర్ స్టోకు గట్టిగానే ఇచ్చిపడేశాడు. మొదట జరిగిన గొడవ స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. ఆ గొడవ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి గిల్ వర్సెస్ బెయిర్ స్టో ఫైట్‌లో తప్పు ఎవరిదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🫶🏻🫶🏻 pic.twitter.com/uBq4DueaYX
— zahana🕷️ (@77ftw_) March 9, 2024
Shubman Gill, Dhruv Jurel, Sarfaraz v Bairstow-Some exchange of words between them 😅🤪
Ben Stokes and Co 🤪🤣🤣#TestCricket #INDvENG #ShubmanGill #DhruvJurel #Bairstow #CricketTwitter pic.twitter.com/TI2MkzMT6i— Dipanjan Chatterjee (@I_am_DipCh) March 9, 2024
Heated argument between Gill & Bairstow during the match 👀 pic.twitter.com/079gcAbksK
— CricketGully (@thecricketgully) March 9, 2024