బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. టీ20 వరల్డ్‌ కప్‌పై ICC కీలక నిర్ణయం!

బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. టీ20 వరల్డ్‌ కప్‌పై ICC కీలక నిర్ణయం!

Women's T20 World Cup 2024, Bangladesh, ICC: బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Women's T20 World Cup 2024, Bangladesh, ICC: బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌ అల్లర్ల గురించి పుంకాను పుంకానుగా వార్తలు వస్తున్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసన తీవ్ర అల్లర్లకు దారి తీయడంతో ఏకంగా ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయినా ఇంకా అల్లర్లు చల్లరలేదు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ (ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌) కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఐసీసీ తీసుకోబోయే నిర్ణయం బంగ్లాదేశ్‌కు మరింత నష్టం చేకూర్చేలా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ ఏడాది బంగ్లాదేశ్ వేదికగా ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్‌ 3 నుంచి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను బంగ్లాదేశ్‌ నుంచి తరలించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లో కాకుండా మరో దేశంలో ఈ మెగా టోర్నీ నిర్వహించాలని అనుకుంటోంది. ఇప్పుడిప్పుడే ఉమెన్‌ క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్‌ తీసుకోవాలని ఐసీసీ అనుకోవడం లేదు.

ఇంత భారీ అల్లర్ల మధ్య బంగ్లాదేశ్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహించడం సరికాదని ఐసీసీతో పాటు పలు క్రికెట్‌ బోర్డులు కూడా భావిస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ అఫిషీయల్స్‌ పలు క్రికెట్‌ బోర్డుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నట్లు సమాచారం. ఆయా బోర్డులు ఇచ్చిన సూచనల ప్రకారం.. యూఏఈ, శ్రీలంక, ఇండియాలో టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ నిర్వహించే ఆలోచనలలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశాన్ని ఫైనల్‌ చేయనుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments