SNP
SNP
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 153 బంతుల్లోనే 28 ఫోర్లు, 11 సిక్సులతో ఏకంగా 244 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కౌంటీ క్రికెట్‌లో భాగంగా మెట్రో బ్యాంక్ వన్డే కప్ టోర్నీలో నార్తాంప్టన్‌షైర్ జట్టు తరపున ఆడుతున్న షా.. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సూపర్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా పృథ్వీ షా పేరు మారుమోగిపోతుంది. ప్రస్తుతం అతనే టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌తో పృథ్వీ షా తిరిగి మళ్లీ టీమిండియాలోకి తిరిగి వస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే జట్టులో స్థానం కోసం షా పోటీలోకి వచ్చాడని క్రికెట్ అభిమాలు సైతం భావిస్తున్నారు.
ప్రస్తుతం రోహిత్‌కు జోడీగా ఉన్న శుబ్‌మన్ గిల్ అతను కాకుంటే ఇషాన్ కిషన్ టీమిండియా ఓపెనర్లుగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీళ్లిద్దరూ ఫామ్‌లో లేకపోవడంతో పృథ్వీ షాకు కూడా టీమ్‌లోకి తలుపులు తెరుచుకునే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ నేపథంలో పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోమర్‌సెట్‌పై డబుల్ సెంచరీ చేసిన తర్వాత షా మాట్లాడుతూ.. ‘టీమిండియా నుంచి తనను ఎందుకు తప్పించారో తనకు కారణం చెప్పలేదు. సరైన ఫిట్‌నెస్ లేకపోవడంతో తప్పించారని కొంతమంది నాతో చెప్పారు. కానీ, నేను నేషనల్ క్రికెట్ అకాడమీలో అన్ని ఫిట్‌నెస్ పరీక్షలు పాస్ అయ్యాను. అలాగే దేశవాళీలో పరుగులు కూడా చేశారు. కానీ వెస్టిండీస్ టూర్‌లో నన్ను ఎంపిక చేయకపోవడం చాలా నిరాశ కలిగించింది. అయినా కూడా నా పని నేను చేసుకుంటూ వెళ్లాలి.’ అని అన్నాడు.
కాగా.. జట్టులోకి తిరిగొచ్చే సూచనలు కనిపిస్తున్న సమయంలో తనను అకారణంగా టీమిండియా తప్పించారనే వివాదాస్పద వ్యాఖ్యలు పృథ్వీ షా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా.. తను ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. అయితే ఆ తర్వాత ఎక్కువ కాలం టీమ్‌లో ఉండలేకపోయాడు. మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు, ఒక టీ20 ఆడిన షా.. 2021 జులై 25న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత మళ్లీ టీమిండియా తరపున మ్యాచ్ ఆడలేదు. మరి పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Prithvi Shaw said, “when I was dropped from team India, I didn’t get to know the reason. Someone told me it could be fitness, I cleared tests at the NCA, again scored runs, but didn’t get a chance in WI. I’m disappointed, but you just have to move on”. pic.twitter.com/u6mF9lkad6
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 10, 2023
ఇదీ చదవండి: తిలక్ వర్మ-సురేష్ రైనా.. అచ్చుగుద్దినట్లు రికార్డులన్నీ సేమ్