iDreamPost
android-app
ios-app

Will Jacks: తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిన RCB బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు!

  • Published Jan 19, 2024 | 9:46 AM Updated Updated Jan 19, 2024 | 9:46 AM

తుఫాన్ బ్యాటింగ్ తో చెలరేగాడు ఆర్సీబీ ప్లేయర్, ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జాక్స్. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ సెంచరీ నమోదు చేసి.. ఔరా అనిపించాడు.

తుఫాన్ బ్యాటింగ్ తో చెలరేగాడు ఆర్సీబీ ప్లేయర్, ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జాక్స్. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ సెంచరీ నమోదు చేసి.. ఔరా అనిపించాడు.

Will Jacks: తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిన RCB బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు!

IPL.. మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన మినీ వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. గత సీజన్ లో గాయం కారణంగా టోర్నీకి దూరం అయిన స్టార్ ఆల్ రౌండర్, ప్రస్తుతం దుమ్మురేపుతున్నాడు. తాజాగా ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 41 బంతుల్లోనే విధ్వంసం సృష్టించాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సీజన్ లోనైనా తమ కల నెరవేరుతుందని భావిస్తున్నారు. మరి తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిన ఆ స్టార్ బ్యాటర్ ఎవరు? ఆ వివరాలు చూద్దాం.

సౌతాఫ్రికా వేదికగా SA టీ20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్ వర్సెస్ ప్రిటోరియా క్యాపిటల్స్ జట్ల మధ్య గురువారం(జనవరి 18)న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్, ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జాక్స్. ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తూ.. కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్స్ లతో సెంచరీ బాదాడు. దీంతో ఈ లీగ్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ శతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా జాక్స్ రికార్డు నెలకొల్పాడు. విల్ జాక్స్ తుఫాన్ బ్యాటింగ్ ధాటికి క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. జాక్స్ థండర్ ఇన్నింగ్స్ కు తోడు.. కొలిన్ ఇంగ్రామ్ 23 బంతుల్లో 43, ఫిలిప్ సాల్ట్ 13 బంతుల్లో 23 పరుగుల మెరుపు బ్యాటింగ్ చేశారు.

will jacks superb batting

అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి.. 17 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉండగా.. విల్ జాక్స్ ఫాస్టెస్ట్ సెంచరీతో అదరగొట్టడంతో, ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. గత సీజన్ లో గాయం కారణంగా టోర్నీకి దూరం అయిన జాక్స్.. ఈ సీజన్ లో అయినా జట్టుకు అందుబాటులో ఉండి, ఇదే ఫామ్ ను కొనసాగించాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ ప్లేయర్లు సూపర్ ఫామ్ లో ఉండటంతో.. ఈ సీజన్ లోనైనా తమ తొలి ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. మరి విల్ జాక్స్ థండర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.