SNP
Bhuvneshwar Kumar, Sanju Samson, Umar Akmal: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ అవుటైన బాల్‌కు.. 12 ఏళ్ల క్రితమే మరో స్టార్ బ్యాటర్ బలయ్యాడు. ఆ మ్యాజిక్ బాల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Bhuvneshwar Kumar, Sanju Samson, Umar Akmal: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ అవుటైన బాల్‌కు.. 12 ఏళ్ల క్రితమే మరో స్టార్ బ్యాటర్ బలయ్యాడు. ఆ మ్యాజిక్ బాల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే విధ్వంసకర బ్యాటర్లు జోష్ బట్లర్, సంజు శాంసన్‌లను డకౌట్ చేసి.. రాజస్థాన్ వెన్నులో వణుకుపుట్టించాడు. అలాగే మ్యాచ్ చివరి ఓవర్‌లో 12 పరుగులను డిఫెండ్ చేసి.. ఒక రన్ తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ను భువీ క్లీన్ బౌల్డ్ చేసిన బాల్ అద్భుతంగా స్వింగ్ అయింది. భువీని స్వింగ్ కింగ్ అని ఎందుకు పిలుస్తారో ఆ బాల్ చూస్తే అర్థం అవుతుంది. చాలా కాలం తర్వాత.. తన స్వింగ్ పవరేంటో చూపించాడు భువీ. సంజు అవుటైన బాల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దాంతో పాటే మరో వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ రెండు వీడియోస్‌లో బౌలర్, బాల్ సేమ్.. కానీ, ఆడిన బ్యాటర్లే వేరే. పైగా అవుటైన విధానం, బ్యాటర్ల ఎక్స్‌ప్రెషన్ కూడా సేమ్. 12 ఏళ్ల తర్వాత జరిగిన సంఘటనే మళ్లీ రిపీట్ అయినట్లు అనిపిస్తోంది.. ఆ రెండు వీడియోలు చూస్తే. భువీ వేసిన ఆ సూపర్ డెలవరీకి ఇప్పుడు అవుటైన బ్యాటర్ సంజు శాంసన్ అయితే.. 12 ఏళ్ల క్రితమే అలాంటి అన్ ప్లేయబుల్ డెలవరీకి బలైంది.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్. ఈ పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్.. సరిగ్గా 12 ఏళ్ల క్రితం భువీ స్వింగ్ పవరేంటో చూసి.. ఖంగుతిన్నాడు. ఇప్పుడు సంజు కూడా సేమ్ అదే విధంగా అవుట్ కావడం విశేషం.
2012 డిసెంబర్ 25న బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఇండియా-పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భువీ తన విశ్వరూపం చూపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. టీమిండియా విజయంపై ఎవరికి అంచనాలు లేవు. కానీ, భువనేశ్వర్ కుమార్ పాకిస్థాన్ టాపార్డర్‌ను అతలాకుతలం చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ నసీర్ జమ్‌షెద్, మూడు ఓవర్‌లో మరో ఓపెనర్ అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్‌ను అవుట్ చేసి.. 12 పరుగులకే 3 వికట్లు కూల్చి.. టీమిండియా విజయంపై ఆశలు చేపాడు. ఈ మూడు వికెట్లలో ఉమర్ అక్మల్ వికెట్ మ్యాచ్‌కే హైలెట్‌గా మారింది. అప్పటి వరకు ఉమర్ అక్మల్‌కు అవుట్ స్వింగర్లు వేసి ఇబ్బంది పెట్టిన భువీ.. ఒక్కసారిగా ఇన్‌స్వింగర్ వేసి.. బ్యాట్, ప్యాడ్స్ మధ్య నుంచి మిడిల్ స్టెంప్ ఎగిరి పడే బాల్ వేస్తాడు. ఆ బాల్‌కు అక్మల్ వద్ద ఎలాంటి ఆన్సర్ ఉండదు. అలాంటి బాల్‌ను ఇప్పుడు సంజు శాంసన్‌కు వేశాడు భువీ. రిజల్ట్ కూడా సేమ్ వచ్చింది. మరి ఈ రేర్ డెలవరీ 12 ఏళ్ల తర్వాత రిపీట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The wicket of Sanju Samson reminds me of Umar Akmal wicket taken by Bhuvneshwar Kumar in IND vs PAK series in 2012 👏#SRHvsRR #SRHvRR pic.twitter.com/xJzFtJ5WLN
— Richard Kettleborough (@RichKettle07) May 3, 2024