iDreamPost
android-app
ios-app

Hardik Pandya: కొత్త అవతారం ఎత్తిన హార్దిక్.. లంకకు దబిడిదిబిడే!

  • Published Jul 26, 2024 | 4:41 PM Updated Updated Jul 26, 2024 | 4:41 PM

India vs Sri Lanka: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్​లో దుమ్మురేపిన పాండ్యా.. ఇప్పుడు లంక బెండు తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

India vs Sri Lanka: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్​లో దుమ్మురేపిన పాండ్యా.. ఇప్పుడు లంక బెండు తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

  • Published Jul 26, 2024 | 4:41 PMUpdated Jul 26, 2024 | 4:41 PM
Hardik Pandya: కొత్త అవతారం ఎత్తిన హార్దిక్.. లంకకు దబిడిదిబిడే!

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్​లో దుమ్మురేపిన పాండ్యా.. ఇప్పుడు లంక బెండు తీసేందుకు సిద్ధమవుతున్నాడు. పొట్టి వరల్డ్ కప్​ ఫామ్​నే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అయితే టీ20 టీమ్ సారథ్య పగ్గాలు దక్కలేదనే బాధ అతడి ఆట మీద ప్రభావం చూపిస్తుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటు కెప్టెన్సీ పోవడం, అటు భార్య నటాషా స్టాంకోవిచ్​తో డివోర్స్ అతడ్ని మానసికంగా దెబ్బతీశాయి. ఫిట్​నెస్ కారణంగా చూపి పాండ్యాకు కాదని సూర్యకు కెప్టెన్సీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే రీజన్​తో శ్రీలంకతో వన్డేలకు కూడా అతడ్ని ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీలో ఆడి ఫిట్​నెస్ ప్రూవ్ చేసుకుంటేనే వన్డేల్లోకి ఎంట్రీ అని కోచ్ గంభీర్ స్పష్టం చేయడంతో హార్దిక్ తానేంటో చూపించాలని అనుకుంటున్నాడు.

లంక సిరీస్​లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న హార్దిక్ ప్రాక్టీస్ సెషన్​లో చెమటోడ్చుతున్నాడు. కంటిన్యూస్​గా బౌలింగ్, బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. అదే సమయంలో టీమ్​లోని ఇతర కుర్రాళ్లతో జోవియల్​గా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే పేస్ బౌలింగ్​తో రచ్చ చేసే పాండ్యా.. ఇందులో మాత్రం లెగ్ స్పిన్​ బౌలింగ్​ చేస్తూ కనిపించాడు. కొత్త అవతారం ఎత్తిన స్టార్ ఆల్​రౌండర్.. ప్రాపర్ లెగ్ స్పిన్​ గ్రిప్​తో బౌలింగ్ చేశాడు. ఈ వీడియోలు చూసిన నెటిజన్స్.. శ్రీలంకకు మూడిందని అంటున్నారు. కెప్టెన్సీ పోయిన కసిలో ఉన్న పాండ్యా.. పర్యాటక జట్టు మీద పిడుగులా పడటం ఖాయమని చెబుతున్నారు.

లెగ్ స్పిన్ ఆయుధాన్ని మ్యాచ్​లో హార్దిక్ వాడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఫిట్​నెస్ ఇష్యూస్ కారణంగా కెప్టెన్సీ పోవడం, వన్డే టీమ్​లో బెర్త్ కూడా చేజారినందున ఇక మీదట కొత్త పాండ్యాను చూసే అవకాశం ఉందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అతడు ఫుల్ కోటా బౌలింగ్ చేయడం, మ్యాచ్ ఆసాంతం ఫీల్డింగ్ చేయడం ఖాయమని చెబుతున్నారు. వికెట్ల మధ్య కూడా వేగంగా పరుగులు తీస్తూ తానేంటో నిరూపించుకునేందుకు అతడు ప్రయత్నిస్తాడని అంటున్నారు. ఇదే జరిగితే ప్లేయర్​గా హార్దిక్ మరో మెట్టు ఎక్కడమే గాక టీమిండియా కూడా మరింత స్ట్రాంగ్​గా మారుతుందని అంచనా వేస్తున్నారు. మరి.. లంక సిరీస్​లో కొత్త హార్దిక్​ను చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.