SNP
Virat Kohli, IND vs PAK, T20 World Cup 2024: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో భారత క్రికెట్ అభిమానులు సంతోషంగా కోహ్లీ విషయంలో కంగారు పడుతున్నారు. అతన్ని కావాలనే బలి చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Virat Kohli, IND vs PAK, T20 World Cup 2024: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో భారత క్రికెట్ అభిమానులు సంతోషంగా కోహ్లీ విషయంలో కంగారు పడుతున్నారు. అతన్ని కావాలనే బలి చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 7 వికెట్లతో తేడా నెగ్గి సూపర్ 8కు అర్హత సాధించింది. అంతకంటే ముందు చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ బలంతో లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో గెలిచింది. అయితే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా దిగి విఫలం అయ్యాడు. పాక్‌పై 3 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేసిన కోహ్లీ.. అమెరికాపై గోల్డెన్ డక్ అయ్యాడు. అంతకంటే ముందు ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా ఆడిన కోహ్లీ.. 5 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలం అయ్యాడు.
ఇలా మూడు వరుస వైఫల్యాలతో కోహ్లీపై విమర్శలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2024లో ఓపెనర్‌గా సూపర్ ఫామ్ కనబర్చి, లీగ్‌లోనే టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి కోహ్లీ.. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా అదరగొడతాడని అంతా భావించారు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నా కూడా అతన్ని పక్కనపెట్టి.. కోహ్లీని ఓపెనర్‌గా ఆడిస్తున్నారు. ఇది అంత మంచి ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీంతో.. కోహ్లీని కావాలనే బలి చేస్తున్నారా? అని కొంత మంది కోహ్లీ అభిమానులు ఆరోపిస్తున్నారు. వన్‌డౌన్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కోహ్లీని ఇప్పుడు ఓపెనర్‌గా ఆడించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. పైగా రెండు వరుస వైఫల్యాల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆల్‌రౌండర్లను ఎక్కువ మంది తీసుకునేందుకు కోహ్లీని ఓపెనర్‌గా ఆడిస్తున్నట్లు క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. కోహ్లీ వన్ డౌన్‌లో ఆడి ఓపెనర్‌గా జైస్వాల్ ఆడితే.. ప్రస్తుతం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడుతున్న నలుగురు ఆల్‌రౌండర్లలో ఒకరు బెంచ్‌కే పరిమితం అవుతారు. హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే. అయితే.. వీరిలో శివమ్ దూబేను ఆల్‌రౌండర్‌గా తీసుకుంటున్నా.. అతనికి బౌలింగ్ ఇవ్వడం లేదు. ముగ్గురు క్వాలిటీ పేసర్లు బుమ్రా, సిరాజ్, అర్షదీప్‌తో పాటు పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ బంతని పంచుకుంటున్నారు. ఇలా టీమ్‌లో ఆల్‌రౌండర్‌గా ఉండి బౌలింగ్ చేయని దూబే టీమ్‌లో ఎందుకు.. అతని ప్లేస్‌లో జైస్వాల్‌ను ఓపెనర్‌గా దింపి, కోహ్లీని వన్‌డౌన్‌లోనే ఆడిస్తే మంచి ఫలితాలు ఉంటాయని క్రికెట్ పండితులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨| WATCH: Speed’s reaction to Virat Kohli losing his wicket during the IND vs. PAK match pic.twitter.com/zEGAzksiwJ
— Speedy HQ (@iShowSpeedHQ) June 9, 2024