iDreamPost
android-app
ios-app

MS Dhoni: విజయం తర్వాత ధోని స్టంప్స్ ను ఎందుకు తీసుకెళ్లేవాడో తెలుసా? ప్రత్యేక కారణమే ఉంది!

  • Published Aug 22, 2024 | 6:26 PM Updated Updated Aug 22, 2024 | 6:26 PM

ధోని మ్యాచ్ లో గెలిచిన తర్వాత స్టంప్స్ ను తనతో తీసుకెళ్తాడు. ఇలా ఎందుకు చేస్తాడో తెలుసా? దానికి ప్రత్యేక కారణమే ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ధోని మ్యాచ్ లో గెలిచిన తర్వాత స్టంప్స్ ను తనతో తీసుకెళ్తాడు. ఇలా ఎందుకు చేస్తాడో తెలుసా? దానికి ప్రత్యేక కారణమే ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

MS Dhoni: విజయం తర్వాత ధోని స్టంప్స్ ను ఎందుకు తీసుకెళ్లేవాడో తెలుసా? ప్రత్యేక కారణమే ఉంది!

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ పై చెరగనిముద్ర వేసిన ఓ దిగ్గజం. ఇక టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన కెప్టెన్ గా తనకంటూ ప్రత్యేక రికార్డును లిఖించుకున్నాడు. ఇవన్నీ కాకుండా కెప్టెన్ గా తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడం మహీ విన్నింగ్ స్ట్రాటజీ. ఇక బెస్ట్ ఫినిషర్ గా భారత క్రికెట్ పైనే కాక.. వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్ర వేశాడు. ధోనిలాంటి ఫినిషర్ ప్రపంచ క్రికెట్ లోనే లేడని చెప్పాలి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ధోని మ్యాచ్ లో గెలిచిన తర్వాత స్టంప్స్ ను తనతో తీసుకెళ్తాడు. ఇలా ఎందుకు చేస్తాడో తెలుసా? దానికి ప్రత్యేక కారణమే ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి క్రికెట్ లవర్స్ కు ప్రత్యేక పరిచయ అక్కర్లేదు. తన కెప్టెన్సీతో, ఆటతీరుతో వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక ధోని భారత క్రికెట్ కు అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2011 వన్డే వరల్డ్ కప్ తో పాటుగా 2007 టీ20 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను అందించిన ఘనత ధోని సొంతం. ఇక ఇది కాసేపు పక్కనపెడితే.. ధోని మ్యాచ్ గెలిచిన తర్వాత అందరి ఆటగాళ్ల కంటే భిన్నంగా ఓ పని చేస్తాడు. విజయం తర్వాత స్టంప్స్ ను తనతో పాటుగా తీసుకెళ్తాడు. చాలా మ్యాచ్ ల్లో ఇది చూసే ఉన్నాం. అయితే ఇలా స్టంప్స్ తీసుకెళ్లి ధోని ఏం చేస్తాడు? అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ధోని సమాధానం ఇచ్చాడు.

Dhoni stumps

“మ్యాచ్ గెలిచిన సందర్భంగా, గుర్తుగా నేను స్టంప్స్ ను తీసుకెళ్తాను. ఆ మ్యాచ్ లో మేం ఎలా పోరాడాం? ఎలా రెడీ అయ్యాం? అన్న విషయాలు గుర్తుంచుకోవడానికి ఇలా చేస్తాను. మా ఇంటిలో వీటిని భద్రపరచడానికి ప్రత్యేక ప్లేస్ ఉంది” అని చెప్పుకొచ్చాడు మహేంద్రసింగ్ ధోని. దాంతో ఈ ప్రత్యేక కారణంతోనే ధోని స్టంప్స్ తీసుకెళ్తున్నాడా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే 2015లో ప్లేయర్లు ఇలా స్టంప్స్ తీసుకెళ్లకుండా ఐసీసీ నిషేధం విధించింది. లక్షలు పోసి లెడ్ స్టంప్స్ ను తీసుకొచ్చిన దగ్గర నుంచి ఐసీసీ ఈ నిబంధన తీసుకొచ్చింది.