iDreamPost
android-app
ios-app

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఇకపై కెప్టెన్ కాలేడా? బోర్డు అన్నీ గమనించింది!

  • Published Jul 17, 2024 | 3:34 PM Updated Updated Jul 17, 2024 | 3:34 PM

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా ఒడిసి పట్టడంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోల్ ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్​లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడతను.

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా ఒడిసి పట్టడంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోల్ ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్​లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడతను.

  • Published Jul 17, 2024 | 3:34 PMUpdated Jul 17, 2024 | 3:34 PM
Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఇకపై కెప్టెన్ కాలేడా? బోర్డు అన్నీ గమనించింది!

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా ఒడిసి పట్టడంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోల్ ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్​లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడతను. టైటిల్ ఫైట్ అనే కాదు.. మెగా టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. ఐపీఎల్​ టైమ్​లో బ్యాటింగ్, బౌలింగ్​లో ఫెయిలైన పాండ్యా.. పొట్టి కప్పులో మాత్రం తనలోని రియల్ టాలెంట్​ను బయటకు తీశాడు. వరల్డ్ కప్ ముగిశాక స్వదేశానికి వచ్చిన అతడు.. పలు ఈవెంట్స్​లో పాల్గొంటూ బిజీగా గడిపాడు. ఎట్టకేలకు సొంత నగరం వడోదరకు చేరుకున్న స్టార్ ఆల్​రౌండర్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీ20 క్రికెట్​కు కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్​బై చెప్పడంతో కొత్త సారథిని నియమించే పనుల్లో బిజీగా ఉంది బీసీసీఐ. ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక సిరీస్​ కోసం ఒకట్రెండు రోజుల్లో టీమ్స్​ను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఇదే అవకాశంగా జట్టుకు పర్మినెంట్ కెప్టెన్​ను అనౌన్స్​ చేయాలని భావిస్తోందట. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్​ను ఆ పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయిందట. అయితే టీ20 ప్రపంచ కప్​లో వైస్ కెప్టెన్​గా ఉన్న పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. పొట్టి కప్పులో రాణించినా హార్దిక్​ను పట్టించుకోకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. అయితే స్వయం కృతాపరాధమే అతడి కొంపముంచిందని తెలుస్తోంది. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్​గా అతడి ప్రవర్తనను భారత క్రికెట్ బోర్డు గమనించింది. రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్​ సూచనల్ని అతడు పట్టించుకోలేదు. సూర్యకుమార్, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లను పాండ్యా కలుపుకొని వెళ్లకపోవడం బోర్డుకు నచ్చలేదట.

ప్లేయర్​గా హార్దిక్ స్కిల్స్​ మీద అనుమానాలు లేకపోయినా బిహేవియర్, యాటిట్యూడ్ పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది. ఎంఐ సారథిగా ఉన్నప్పుడు ప్రవర్తించిన విధంగానే ఇంటర్నేషనల్ టీమ్​లోనూ అదే తీరుతో ఉంటే కష్టమని బీసీసీఐ భావించిందట. పాండ్యా కెప్టెన్​గా అదే యాటిట్యూడ్​ను చూపిస్తే ఆటగాళ్లలో యూనిటీ పోతుందని భయపడిందట. ఇది ఆలోచించే అనూహ్యంగా సూర్యకుమార్ పేరును తీసుకొచ్చారని సమాచారం. టీ20 వరల్డ్ కప్-2026 వరకు సూర్యనే కెప్టెన్​గా ఉంచాలని డిసైడ్ అయిందట బోర్డు. ఆ తర్వాత ఎలాగూ శుబ్​మన్ గిల్ వచ్చేస్తాడు. దీంతో ఇక హార్దిక్​కు కెప్టెన్సీ దక్కే స్కోప్ కనిపించడం లేదు. సేమ్ టైమ్ వన్డే, టెస్టులకు కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి.. పాండ్యా విషయంలో బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.