iDreamPost
android-app
ios-app

టీమిండియా ఫ్యూచర్​కు ఢోకా లేదు.. అంతా అతడే చూసుకుంటాడు: బ్రెట్​లీ

  • Published Jul 16, 2024 | 9:12 PM Updated Updated Jul 16, 2024 | 9:12 PM

Brett Lee: టీమిండియా ఫ్యూచర్​కు ఢోకా లేదని అంటున్నాడు ఆస్ట్రేలియా లెజెండ్ బ్రెట్​లీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకున్నా అంతా అతడే చూసుకుంటాడని చెప్పాడు.

Brett Lee: టీమిండియా ఫ్యూచర్​కు ఢోకా లేదని అంటున్నాడు ఆస్ట్రేలియా లెజెండ్ బ్రెట్​లీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకున్నా అంతా అతడే చూసుకుంటాడని చెప్పాడు.

  • Published Jul 16, 2024 | 9:12 PMUpdated Jul 16, 2024 | 9:12 PM
టీమిండియా ఫ్యూచర్​కు ఢోకా లేదు.. అంతా అతడే చూసుకుంటాడు: బ్రెట్​లీ

భారత క్రికెట్​లో కొన్ని వారాల్లోనే చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20 వరల్డ్ కప్​-2024తో కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పేశాడు. అతడితో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 క్రికెట్​ నుంచి తప్పుకున్నారు. ఇక మీదట వీళ్లు వన్డేలు, టెస్టులకు పరిమితం కానున్నారు. పొట్టి కప్పుతో టీమ్ మేనేజ్​మెంట్​లోనూ ఛేంజెస్ జరిగాయి. హెడ్ కోచ్ పోస్ట్​ నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్​ పోస్ట్, పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి బైబై చెప్పేశారు. కొత్త హెడ్ కోచ్​గా నియమితుడైన గౌతం గంభీర్.. సపోర్ట్ స్టాఫ్​ను ఎంచుకునే పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు. గతంలో ఐపీఎల్ టైమ్​లో తనతో కలసి పనిచేసిన వారిని టీమిండియాలోకి తీసుకొచ్చేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు.

ఒకవైపు కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లీ టీ20ల నుంచి తప్పుకోవడం.. మరోవైపు కోచ్ బాధ్యతలను ద్రవిడ్​ వదిలేయడంతో భారత క్రికెట్​ ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. యువకులు, సీనియర్లను కొత్త కోచ్ గంభీర్ ఎలా ముందుండి నడిపిస్తాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అంటున్నాడు ఆస్ట్రేలియా లెజెండ్ బ్రెట్​లీ. గంభీర్ ఉన్నంత వరకు టీమిండియా ఫ్యూచర్​కు ఢోకా ఉండదని చెప్పాడు. రోహిత్, కోహ్లీ లేకపోయినా అంతా తానై గౌతీ చూసుకుంటాడని నమ్మకంగా చెప్పాడు. గంభీర్ దూకుడు భారత జట్టుకు మంచి చేస్తుందని.. అతడి అప్రోచ్​ టీమ్​కు చాలా అవసరమని తెలిపాడు బ్రెట్​లీ. ఇక, భారత్​ను ఆపలేమన్నాడు.

Gambhir

‘ఎప్పుడు తనకు అవకాశం వచ్చినా గంభీర్ అద్భుతంగా పని చేస్తూ వచ్చాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ను ఛాంపియన్స్​గా నిలపడమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆటగాళ్ల కోసం గౌతీ ఎప్పుడూ నిలబడతాడు. జట్టులోని ప్లేయర్లు అందర్నీ ఒకతాటి పైకి తీసుకురావడం ఎలాగో అతడికి బాగా తెలుసు. టీమ్​ను సాలిడ్​గా డెవలప్ చేస్తాడు. ఆటగాడిగా గంభీర్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతడి అగ్రెషన్, విన్నింగ్ యాటిట్యూడ్ కచ్చితంగా భారత్​కు ఉపయోగపడతాయి. గంభీర్ చేతుల్లో టీమిండియా ఫ్యూచర్​ సేఫ్​గా ఉంటుంది. కోచ్​గా తన కెరీర్​ను వరల్డ్ కప్​ గెలిచి ముగించిన రాహుల్ ద్రవిడ్​కు కంగ్రాట్స్’ అని బ్రెట్​లీ చెప్పుకొచ్చాడు. మరి.. గంభీర్ ఉన్నంత వరకు భారత్​ను ఆపలేమంటూ ఆసీస్ దిగ్గజం చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by CricTracker (@crictracker)