కోహ్లీ తన బలహీనతని.. బలంగా ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు? అప్పట్లో సచిన్ చేసి చూపించాడు!

Kohli Weakness: బలహీనత.. ఇది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బలహీనత లేని వ్యక్తులు అంటూ ఎవరూ ఉండరు. కానీ ఆ బలహీనతను బలంగా మార్చుకునేవారే అసలైన కింగ్ అవుతారు. ఈ విషయంలో కింగ్ కోహ్లీ కూడా బలహీనతను బలంగా మార్చుకోలేక ఇబ్బంది పడుతున్నాడు.

Kohli Weakness: బలహీనత.. ఇది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బలహీనత లేని వ్యక్తులు అంటూ ఎవరూ ఉండరు. కానీ ఆ బలహీనతను బలంగా మార్చుకునేవారే అసలైన కింగ్ అవుతారు. ఈ విషయంలో కింగ్ కోహ్లీ కూడా బలహీనతను బలంగా మార్చుకోలేక ఇబ్బంది పడుతున్నాడు.

మన బలహీనత ప్రత్యర్థులకు బలం అవుతుంది. అయితే.., అందరి విషయంలో అలా అవ్వదు! కొంతమంది వీరులు మాత్రం బలహీనతని కూడా తమ బలంగా మలుచుకుని చరిత్ర సృష్టిస్తుంటారు. ఆ కోవకి చెందిన ఆటగాడే క్రికెట్ గాడ్ “సచిన్ టెండూల్కర్”. అయితే.. ఈ లెజండ్రీ ప్లేయర్ రికార్డ్స్ ని వేటాడుతూ,  క్రికెట్ సామ్రాజ్యంలో కింగ్ గా ఎదిగిన కోహ్లీ ఏమీ తక్కువ ఏమి కాదు. అయితే.., సచిన్ లా  కోహ్లీ ఆలోచించలేకపోతున్నాడు. తన బలహీనతని బలంగా మార్చుకొని ముందుకు సాగలేకపోతున్నాడు. ఇది కోహ్లీకి, అతన్నే నమ్ముకున్న టీమిండియాకి శాపంగా మారుతోంది. ఈ బలహీనత  ఏంటి? ఇక్కడ సచిన్ తో కోహ్లీకి పోలిక ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. 

ఇంటర్నేషనల్  క్రికెట్ లో ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లీకి బ్యాట్  తో పెట్టిన విద్య. ఇలాంటి కోహ్లీ కొన్ని బలహీనతలను మాత్రం దాటలేకపోతున్నాడు. ఆఫ్ సైడ్ కోహ్లీ కొట్టే కవర్ డ్రైవ్స్ కి కోట్లలో  అభిమానులు ఉన్నారు. కానీ.., ఇక్కడ బ్యాడ్ లక్  ఏంటి అంటే.. ఆ 5th స్టంప్  బాల్స్ ని కవర్ డ్రైవ్ ఆడే సమయంలో కోహ్లీ చాలా సార్లు అవుట్ అయిపోతున్నాడు. ఇక షార్ట్ పిచ్ బంతుల వీక్ నెస్  గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిన్నటి ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా కోహ్లీ షార్ట్ పిచ్ బంతిని బౌండరీకి తరలించలేక క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఇలా బలహీనతలతో ఇబ్బంది పడటం, ఐసీసీ నాకౌట్స్ లో ఇలాంటి బాల్స్ కి అవుట్  అవ్వడం సగటు క్రికెట్ అభిమానులను కలిచివేస్తోంది.  నిజానికి ఇలా పెద్ద టీమ్స్ మాత్రమే కాదు.. చిన్న టీమ్స్ కూడా కోహ్లీ బలహీనతలపై ఫోకస్ చేసి, ఒక గేమ్ ప్లాన్ తో కింగ్ ని బోల్తా కొట్టిస్తున్నాయి. విరాట్ తనదైన రోజున  ఎవరినైనా చిత్తు చేస్తాడు. ఇప్పుడు కొత్తగా కొట్టాల్సిన కొత్త రికార్డ్స్ కూడా ఏమీ లేవు. కానీ.., ఒక దేశం ఆశలు మోసే అంతటి క్రికెటర్ తన బలహీనతల్ని.. బలంగా ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు అన్నదే ఇక్కడ ప్రశ్న. 

నిజానికి బలహీనతలు లేని ఆటగాడు అంటూ ఉండడు. వరల్డ్ క్రికెట్ ని కొన్నాళ్ళు శాసించిన గంగూలీకి బాడీ లైన్ ఆడటం అంటే భయం. ఆ బలహీనతని అధిగమించలేకే దాదా కెరీర్ ముగిసింది. ఇక పాంటింగ్ ఆఫ్  స్పిన్ ఫోబియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ.., వీరందరిలో సచిన్ మాత్రం ప్రత్యేకం. 2004 ప్రాంతంలో సచిన్ కి కవర్ డ్రైవ్స్ ఆడే సమయంలో క్యాచ్ లు ఇవ్వడం బలహీనతగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో కీలకమైన ఆస్ట్రేలియా టూర్ మొదలైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సచిన్ మొదటి మూడు టెస్ట్ లు ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. వరుసగా 0, 1, 37, 0, 44 పరుగులు సాధించి..  క్రికెట్ గాడ్ విమర్శల పాలయ్యాడు. ఇందులో కవర్ డ్రైవ్స్ ఆడుతూ అవుట్ అయిన సందర్భాలే ఎక్కువ. ఇక ఆస్ట్రేలియా  మీడియా అయితే  సచిన్ పని అయిపోయింది అని కథనాలు కూడా రాసేసింది. 

పవర్ ఫుల్ ప్లేయర్స్ కమ్ బ్యాక్.. అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది. 2004 జనవరి 2న ఆస్ట్రేలియాతో నాలుగో  టెస్ట్ మొదలైంది. ముందుగా ఇండియాది బ్యాటింగ్. 128 రన్స్ కి 2 వికెట్స్ పడ్డాక.. మాస్టర్ బ్లాస్టర్ క్రీజ్ లోకి వచ్చాడు. “జాసన్ గిల్లెస్పీ, బ్రెట్ లీ, బ్రాకెన్”, లాంటి స్టార్ బౌలర్లు..  సచిన్ వీక్ నెస్ పై దెబ్బ కొట్టాలని 5th స్టెంప్ లైన్ వేస్తూ కవ్వించారు. కానీ.., క్రికెట్ దేవుడు ఇసుమంత అయినా చలించలేదు. నిబ్బరంగా అన్ని పరుగులు లెగ్ సైడ్ సాధిస్తూ ముందుకు సాగాడు. ఇక క్రీజ్ లో కుదురుకున్నాక కంగారూలకి చుక్కలు చూపించాడు.  ఏకంగా 436 బంతులు ఎదుర్కొని.. 241 పరుగులు సాధించి నిజంగానే పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇంకా విశేషం ఏమిటో తెలుసా? ఈ 241 పరుగుల్లో ఒక్క కవర్ డ్రైవ్ కూడా లేకపోవడం. అదీ నిబద్ధత అంటే. అదీ నిశ్చలంగా ఉండటం అంటే. అది ఫోకస్ అంటే. అది బలహీనతని బలంగా మార్చుకోవడం అంటే. ఇప్పుడు కోహ్లీకి కూడా ఇలాంటి ఫోకస్ కావాలి. అందుకు టీమ్ కూడా అండగా నిలవాలి. స్టాట్స్ పరంగా ఎప్పుడో సచిన్ కన్నా బెస్ట్ అనిపించుకున్న కోహ్లీ.. ఈ బలహీనతలని దాటాలని మనం కోరుకుందాం.

Show comments