Joe Root: ఇంగ్లండ్ స్టార్ రూట్ క్రేజీ రికార్డ్.. దరిదాపుల్లో లేని కోహ్లీ, రోహిత్!

WI vs ENG: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గ్రేటెస్ట్ క్రికెటర్స్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.

WI vs ENG: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గ్రేటెస్ట్ క్రికెటర్స్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.

ప్రస్తుత క్రికెట్​లో టాప్ బ్యాటర్లలో ఒకడిగా ఇంగ్లండ్ స్టార్ జో రూట్​ను చెప్పొచ్చు. కూల్​గా, కామ్​గా తన పని తాను చేసుకుపోయే అతడు.. క్రీజులో కుదురుకుంటే మ్యాచ్​ను ఫినిష్ చేయనిదే వదలడు. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టే రూట్.. టెస్ట్ స్పెషలిస్ట్​గా పేరు తెచ్చుకున్నాడు. ఆ ఫార్మాట్​లో ఇప్పటికే ఎన్నో మైల్​స్టోన్స్ చేరుకున్న రూట్.. తాజాగా ఓ క్రేజీ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్లలో ఏడో స్థానానికి అతడు ఎగబాకాడు. ఈ క్రమంలో విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా (11,953 పరుగులు)ను అధిగమించాడు.

వెస్టిండీస్​తో జరుగుతున్న ఆఖరి టెస్టులో రూట్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్​తో అతడు 11,954 పరుగుల మార్క్​ను అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక రన్స్ బాదిన వారిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (15,921) ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. రూట్ ఇంకొన్నేళ్ల పాటు ఇదే రీతిలో బ్యాటింగ్ చేస్తే మాస్టర్​బ్లాస్టర్​ను దాటే అవకాశాలు ఉంటాయి. అయితే లీడింగ్ రన్ స్కోరర్స్​ జాబితాలో రూట్​కు దరిదాపుల్లో కూడా భారత స్టార్లు విరాట్ కోహ్లీ (8,848), రోహిత్ శర్మ (4,137) లేరు. ఆ లిస్ట్​లో టాప్​-10లోకి వచ్చే ఛాన్స్ ఉన్న విరాట్ రాబోయే కొన్నేళ్ల పాటు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వన్డే గ్రేట్​గా ఉన్న కోహ్లీ.. టెస్టుల్లోనూ దిగ్గజాల సరసన నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. రూట్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments