SNP
Zimbabwe, ECB, Touring Fee: అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త పరంపరకు జింబాబ్వే జట్టు నాంది పలకనుంది. తమ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు చేస్తున్న ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం..
Zimbabwe, ECB, Touring Fee: అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త పరంపరకు జింబాబ్వే జట్టు నాంది పలకనుంది. తమ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు చేస్తున్న ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జింబాబ్వే జట్టు.. ప్రస్తుతం దీన స్థితికి చేరకుంది. ఎంతలా అంటే.. వేరే దేశానికి వెళ్లి మ్యాచ్‌లు ఆడేందుకు కనీసం తమ ఆటగాళ్లను ఆ దేశానికి పంపే స్థితిలో కూడా లేదు. ఈ క్రమంలోనే జింబాబ్వే పరిస్థితి అర్థం చేసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒక కొత్త ఆలోచన చేసింది. తమ దేశానికి వచ్చి క్రికెట్ ఆడినందుకు జింబాబ్వే జట్టుకు టూరింగ్ ఫీజు కింద కొంత మొత్తం చెల్లించనుంది. మోడ్రన్ క్రికెట్‌లో ఒక దేశానికి క్రికెట్ ఆడేందుకు వెళ్లి ఫీజు కింద డబ్బులు తీసుకునే తొలి టీమ్‌గా జింబాబ్వే నిలువనుంది.
సాధారణంగా ఒక క్రికెటింగ్ నేషన్.. వేరే దేశానికి వెళ్లి టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడితే.. ఎలాంటి ఫీజు తీసుకోదు. పైగా వచ్చీపోయే విమాన ఛార్జి ఖర్చులు, ఆ దేశంలో ఉండేందుకు వసతి కోసం అయ్యే ఖర్చులన్నీ ఆయా దేశాల క్రికెట్ బోర్డులే భరిస్తాయి. ఆ సిరీస్‌లో బ్రాడ్ కాస్టింగ్ రూపంలో వచ్చిన డబ్బును ఐసీసీ షేరింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆతిథ్య జట్టుకు, పర్యటనకు వచ్చిన జట్టుకు పంచుతారు. అయితే.. రాను రాను టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతవడంతో.. చిన్న దేశాలు వేరే దేశాలకు వెళ్లి టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఎందుకంటే.. ఖర్చుకు ఎక్కువగా అవుతుండటంలో పాటు, ఆదాయం కూడా రావడం లేదు. టెస్టు క్రికెట్‌ను స్టేడియానికి వచ్చి చూసే వారి సంఖ్యతో పాటు, టీవీల్లో కూడా ఎక్కువగా వీక్షించడం లేదు. దీంతో.. టెస్టు సిరీస్‌లకు ఆదాయం భారీగా తగ్గిపోయింది. అందుకే జింబాబ్వే లాంటి దేశాలు.. వేరే దేశాలకు తమ టీమ్‌ను పంపి, అక్కడ వారికి వసతి ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత కలిగి లేవు. ఇలా ఆర్థిక సమస్యలతో టెస్టు క్రికెట్ మనుగడకు ముప్పు ఏర్పడుతుండటంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు జింబాబ్వేకు టూరింగ్ ఫీజు చెల్లించేందుకు అంగీకరించింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చే జింబాబ్వే ఈ టూరింగ్ ఫీజు పొందనుంది. మరి ఈ టూరింగ్ ఫీజు సంప్రదాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Zimbabwe will become the first country in the modern era to be paid a “touring fee” by the host board in bilateral cricket when they travel to England for a one-off Test in 2025 https://t.co/CTnE7tbOUb pic.twitter.com/eSB7g3CZZm
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2024