iDreamPost
android-app
ios-app

WI vs SA: సౌతాఫ్రికాకు ఘోర అవమానం! కరేబియన్ల చేతిలో క్లీన్‌స్వీప్‌

  • Published Aug 28, 2024 | 12:47 PM Updated Updated Aug 28, 2024 | 12:47 PM

West India, South Africa: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సూపర్‌ సిరీస్‌ జరిగింది. రెండు బెస్ట్‌ టీమ్స్‌ తలపడిన టీ20 సిరీస్‌లో ఓ టీమ్‌ ఏకపక్షంగా సిరీస్‌ ముగించింది. కరేబియన్‌ గడ్డపై సౌతాఫ్రికాకు ఘోర అవమానం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

West India, South Africa: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సూపర్‌ సిరీస్‌ జరిగింది. రెండు బెస్ట్‌ టీమ్స్‌ తలపడిన టీ20 సిరీస్‌లో ఓ టీమ్‌ ఏకపక్షంగా సిరీస్‌ ముగించింది. కరేబియన్‌ గడ్డపై సౌతాఫ్రికాకు ఘోర అవమానం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 28, 2024 | 12:47 PMUpdated Aug 28, 2024 | 12:47 PM
WI vs SA: సౌతాఫ్రికాకు ఘోర అవమానం! కరేబియన్ల చేతిలో క్లీన్‌స్వీప్‌

పటిష్టమైన సౌతాఫ్రికాను వెస్టిండీస్‌ జట్టు మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ చేసిపడేసింది. సోమవారం రాత్రి జరిగిన చివరి మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కరేబియన్‌ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్‌ రికెల్టన్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. కెప్టెన్‌ మార్కరమ్‌ 12 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. యువ క్రికెటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ 15 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 40 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో స్మిత్‌ 6, వియాన్ ముల్డర్‌ 1 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో వెస్టిండీస్‌కు 13 ఓవర్లలో 116 పరుగుల టార్గెట్‌ను సెట్‌ చేశారు అంపైర్లు. ఈ టార్గెట్‌ను కరేబియన్లు ఊదిపారేశారు. ఓపెనర్‌ అలిక్ అథనాజ్ 1 రన్‌ మాత్రమే చేసి అవుటైనా.. మరో ఓపెనర్‌ షైహోప్‌ 24 బంతుల్లో ఒక ఫోర్‌, 4 సిక్సులతో 42 పరుగులు చేసి.. విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికోలస్ పూరన్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 35, షిమ్రోన్‌ హెట్‌మేయర్‌ 17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 31 పరుగులు చేసి అండగా నిలిచి.. వెస్టిండీస్‌ వరుసగా మూడో విజయాన్ని అందించారు. ఈ విజయంతో.. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను విండీస్‌ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఈ మూడు మ్యాచ్‌లు కూడా ట్రినిడాడ్‌లోనే జరిగాయి. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది, రెండో టీ20లో 30 పరుగుల తేడా విజయం సాధించింది. ఒక చివరి మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే.. అంతకంటే ముందు జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0తో కైవసం చేసుకుంది. ట్రినిడాడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ డ్రా కాగా, గయానా వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెస్టు సిరీస్‌ ఓటమికి.. టీ20 సిరీస్‌ విజయంతో బదులు తీర్చుకుంది వెస్టిండీస్‌. మరి సౌతాఫ్రికాను విండీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.