iDreamPost
android-app
ios-app

Wasim Jaffer: ఆ రూల్‌ ఇండియన్‌ క్రికెట్‌ను నాశనం చేస్తోంది: స్టార్‌ క్రికెటర్‌

  • Published Dec 11, 2023 | 10:13 AM Updated Updated Dec 11, 2023 | 10:13 AM

క్రికెట్‌లో చాలా కొత్త కొత్త రూల్స్‌ వస్తున్నాయి. ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ వచ్చిన తర్వాత క్రికెట్‌ రూల్స్‌ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే.. ఓ రూల్‌ మాత్రం ఇండియన్‌ క్రికెట్‌కు చేటు చేస్తుందని మాజీ క్రికెటర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరి ఆ రూల్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌లో చాలా కొత్త కొత్త రూల్స్‌ వస్తున్నాయి. ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ వచ్చిన తర్వాత క్రికెట్‌ రూల్స్‌ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే.. ఓ రూల్‌ మాత్రం ఇండియన్‌ క్రికెట్‌కు చేటు చేస్తుందని మాజీ క్రికెటర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరి ఆ రూల్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 11, 2023 | 10:13 AMUpdated Dec 11, 2023 | 10:13 AM
Wasim Jaffer: ఆ రూల్‌ ఇండియన్‌ క్రికెట్‌ను నాశనం చేస్తోంది: స్టార్‌ క్రికెటర్‌

కాలం మారుతున్న కొద్ది.. క్రికెట్‌లో కొత్త కొత్త రూల్స్‌ వస్తున్నాయి. కొంతమంది క్రికెట్‌ను ఓ ఆటలా కాకుండా వినోదంలా చూస్తున్న రోజులివి. అందుకే వారి అభిరుచి తగ్గట్లు.. ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ పుట్టుకొచ్చింది. అందులో కూడా ఆటగాళ్లకు, వ్యాపారవేత్తలకు, ప్రేక్షకులకు మరింత వెసులుబాటు, వినోదం కల్పించేందుకు అనేక మార్పులు చేస్తూ.. కొత్త కొత్త రూల్స్‌ తెచ్చారు. ఫ్రీహిట్‌, స్ట్రాటజిక్‌ టైమ్‌ అవుట్‌, ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే.. ఐపీఎల్‌లో గతేడాది ప్రవేశపెట్టిన ఇంప్యాక్ట్‌ రూల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ మాత్రం విమర్శలు కురిపించాడు. ఆ రూల్‌ వల్ల ఇండియన్‌ క్రికెట్‌కు ఊహించని నష్టం జరుగుతుందని అంటున్నారు. మరి అతని వాదనలో నిజమెంతో చూద్దాం​..

ఇంతకీ జాఫర్‌ ఏమన్నాడంటే.. ఐపీఎల్‌ ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ వల్ల.. ఆల్‌రౌండర్లకు బౌలింగ్‌ ఇచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అది అంతిమంగా ఇండియన్‌ క్రికెట్‌కు చేటు చేస్తుందని అన్నాడు. ఐపీఎల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రకారం.. ఒక టీమ్‌ 12 మంది సభ్యులతో ఒక లిస్ట్‌ ఇచ్చి 12వ ఆటగాడిని ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా పేర్కొన్నాలి. మిగిలిన 11 మందిలో ఎవరైనా ఒకరిని అతనితో ఆట మధ్యలో రీప్లేస్‌ చేయవచ్చు. ఈ రూల్‌ను ఉపయోగించి.. ఐపీఎల్‌ టీమ్స్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే.. ఒక బౌలర్‌ను, ముందు బౌలింగ్‌ చేయాల్సి వస్తే ఒక బ్యాటర్‌ను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకుంటున్నారు. దీంతో.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అదనంగా ఒక బౌలింగ్‌ ఆప్షన్స్‌ లభిస్తోంది.

We are losing with that rule!

దీంతో జట్టులో ఉన్న ఆల్‌రౌండర్లకు బౌలింగ్‌ వేసే ఛాన్స్‌ రావడం లేదు. దీంతో.. బ్యాటర్లంతా కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెడుతున్నారు. బౌలింగ్‌ జోలికి పోవడం లేదు. ఇది టీమిండియాపై ప్రభావం చూపుతుంది. జట్టులో పార్ట్‌టైమ్‌ బౌలర్లు లేకపోవడంతో కొన్ని సార్లు జట్టులోని బౌలర్లలో ఒకరిద్దరు విఫలమవుతూ భారీగా పరుగులు ఇస్తున్నా.. వారి కోటాను పార్ట్‌టైమ్‌ బౌలర్లతో పూర్తిచేసే అవకాశం కెప్టెన్‌కు లేకుండా పోతుంది. మొత్తం జట్టుకు నష్టం జరుగుతుంది. గతంలో దిగ్గజ బ్యాటర్లు సైతం పార్ట్‌టైమ్‌ బౌలర్లుగా మెయిన్‌ బౌలర్లకు హెల్ప్‌ఫుల్‌గా ఉండేవాళ్లు. సచిన్‌ టెండూ​ల్కర్‌, గంగూలీ, వీరేందర్‌ సెహ్వాగ్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్లుగా టీమ్‌కు ఎంతో ఉపయోగపడేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బౌలింగ్‌ బాగా పడకపోయినా.. ప్రత్యర్థి బ్యాటర్లు టార్గెట్‌ చేసి కొడుతున్న అదే బౌలర్లతో పూర్తి కోటా వేయించాల్సి వస్తుంది. ఐపీఎల్‌లో ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌తో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని జాఫర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.