భారత్ వేదికగా మరికొన్ని రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామానికి తెర లేవనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల దిగ్గజాలు తమ కలల టీమ్స్ ను ప్రకటించడం మెుదలు పెట్టేశారు. ఈ లిస్ట్ లో ముందున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. 2023 వన్డే ప్రపంచ కప్ కోసం తన టీమ్ ను ప్రకటించాడు. ఇందులో ఆశ్చర్యకరమైన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. జట్టులోకి శిఖర్ ధావన్ ను తీసుకుని అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్ కు తన వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించలేదు జాఫర్. మరి వసీం జాఫర్ వరల్డ్ కప్ జట్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
2023 వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక ఎలా ఉంటుంది? టీమ్ లో ఎవరికి చోటు దక్కుతుంది? యంగ్ ప్లేయర్లకు అవకాశం కల్పిస్తారా? లేదా? అన్న అంశాలపై ఇప్పటికే మాజీల విశ్లేషణలు మెుదలైయ్యాయి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం బరిలోకి దిగబోయే జట్టు ఎలా ఉండాలో సూచిస్తూ.. తన కలల జట్టును ప్రకటించాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.
తాజాగా జియో సినిమాతో మాట్లాడుతూ తన వరల్డ్ కప్ జట్టును ప్రకటించాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ ను జట్టులోకి తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోలేదు. మరో ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే? టీ20 నెంబర్ వన్ బ్యాటర్ అయిన టీమిండియా మిస్టర్ 360 సూర్య కుమార్ ను కూడా తన జట్టులో చోటు కల్పించలేదు. వసీం తన జట్టులో రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్ లు ఓపెనర్లు కాగా.. ధావన్ ను బ్యాకప్ ఓపెనర్ గా పరిగనించాడు. ఆ తర్వాత వరుగా 3వ స్థానంలో కోహ్లీ, 4లో అయ్యార్, 5లో కేఎల్ రాహుల్, 6వ స్థానంలో పాండ్యాలను ఎంపిక చేశాడు.
తన జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు కల్పించాడు జాఫర్. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లతో పాటుగా పేసర్ల అయిన బుమ్రా, షమీ లేదా సిరాజ్ లలో ఒక్కరికి స్థానం కల్పిస్తానని పేర్కొన్నాడు. ఇక నాలుగో సీమర్ గా శార్థుల్ ఠాకూర్ ను ఎంపిక చేసి.. బ్యాకప్ వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకున్నాడు. మరి జాఫర్ వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
Wasim Jaffer picks his Indian squad for the forthcoming World Cup 2023 in India. pic.twitter.com/7e1GeNg9lq
— CricTracker (@Cricketracker) July 24, 2023
ఇదికూడా చదవండి: వైరల్ అవుతున్న ధోని అపాయింట్మెంట్ లెటర్.. చెన్నై కెప్టెన్ శాలరీ ఎంతంటే..?