iDreamPost

వైరల్ అవుతున్న ధోని అపాయింట్​మెంట్ లెటర్.. చెన్నై కెప్టెన్ శాలరీ ఎంతంటే..?

  • Author singhj Published - 06:07 PM, Tue - 25 July 23
  • Author singhj Published - 06:07 PM, Tue - 25 July 23
వైరల్ అవుతున్న ధోని అపాయింట్​మెంట్ లెటర్.. చెన్నై కెప్టెన్ శాలరీ ఎంతంటే..?

క్రికెట్ ఫ్యాన్స్​కు పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోని. జెంటిల్మన్ గేమ్ గురించి తెలియని వారు కూడా ఈ పేరు వినే ఉంటారు. తన ఆటతీరుతో, కెప్టెన్సీ స్కిల్స్​తో క్రికెట్​కు వన్నె తెచ్చిన లెజెండ్​గా ధోనీని చెప్పుకోవచ్చు. అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకునే ఈ దిగ్గజ ప్లేయర్.. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొని మూడేళ్లు కావొస్తున్నా ధోని ఇమేజ్​ ఇసుమంత కూడా మారలేదు. దీనికి ఐపీఎల్​లో ఇంకా ఆడుతూ ఉండటం ఒక కారణమని చెప్పొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్​ తరఫున ఆడుతూ ప్రేక్షకులను ఫుల్​గా ఎంటర్​టైన్ చేస్తున్నాడు ధోని.

సీఎస్​కే టీమ్​ను అన్నీ తానై నడిపిస్తున్నాడు ఎంఎస్ ధోని. ఈ ఏడాది చెన్నై టైటిల్ గెలవడంలో అతడిది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఐపీఎల్ టైమ్​లో గాయంతో ఇబ్బంది పడిన ధోని.. ఇటీవలే దానికి సర్జరీ చేయించుకున్నాడు. నెక్స్ట్​ సీజన్​ టైమ్​కు ఫిట్​గా ఉంటే అతడు తప్పకుండా మరోసారి క్రికెట్ ఫీల్డ్​లోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. భారత జట్టుకు ఆడనప్పటికీ ఆదాయంలో ధోని దూసుకెళ్తున్నాడు. యాడ్స్​లో నటిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నాడు. ధోని సంపాదన మొత్తం దాదాపు రూ.1,050 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఐపీఎల్​లో సీఎస్కేకు ఆడటం ద్వారా అతడు ఏటా రూ.15 కోట్లు అందుకుంటున్నాడు.

ఐపీఎల్​ రెమ్యూనరేషన్​ను పక్కనబెడితే యాడ్స్ చేయడం ద్వారా కూడా ధోని బాగానే సంపాదిస్తున్నాడు. అలాంటి ధోని ఒకప్పుడు చాలా తక్కువ జీతానికి పనిచేశాడట. చెన్నై ఫ్రాంచైజీ ఓనర్, బీసీసీఐ మాజీ బాస్ ఎన్.శ్రీనివాసన్​కు చెందిన ఇండియా సిమెంట్స్​లో ధోని వర్క్ చేశాడట. ఆ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్​ (మార్కెటింగ్​) పోస్టుకు గానూ నెలకు రూ.43 వేలను ధోని అందుకునేవాడట. 2012లో ఇండియా సిమెంట్స్ నుంచి ధోనికి వచ్చిన అపాయింట్​మెంట్​ లెటర్​ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు. రిచెస్ట్ క్రికెటర్లలో ఒకడైన ధోని ఇంత తక్కువ జీతానికి ఎందుకు పనిచేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ఇలాంటిది భారత క్రికెట్​లోనే జరుగుతుందని లలిత్ మోడీ తన పోస్ట్​లో రాసుకొచ్చారు. నెట్టింట వైరల్​గా మారిన ఈ లెటర్​ ద్వారా ధోని, శ్రీనివాసన్​కు మధ్య అప్పట్లో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉండేవని నిరూపించాలని లలిత్ మోడీ అనుకుంటున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొన్నేళ్ల పాటు సీఎస్​కే టీమ్​ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ధోని అపాయింట్​మెంట్ లెటర్​తో మరోమారు ప్రకంపనలు రేపారు లలిత్ మోడీ. ఈ అంశం ఎక్కడికి వెళ్తుందో చూడాలి. మరి.. ధోని అపాయింట్​మెంట్ లెటర్​ అంశంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Lalit Modi (@lalitkmodi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి