SNP
పాకిస్థాన్‌కు ఇంకా వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్‌కు ఛాన్స్ ఉందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే వారందరికీ వసీం అక్రమ్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే కచ్చితంగా చేయాల్సిన పని ఏంటో చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్‌కు ఇంకా వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్‌కు ఛాన్స్ ఉందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే వారందరికీ వసీం అక్రమ్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే కచ్చితంగా చేయాల్సిన పని ఏంటో చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. శుక్రవారం జరిగే మ్యాచ్‌ను వదిలిస్తే.. మూడు లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్‌తో ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకున్నాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్‌కు దాదాపు బెర్తు ఖరారే అయినా.. అధికారంగా ఫిక్స్ కావాలంటే.. పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే. ఇంగ్లండ్‌ను పాకిస్థాన్ భారీ తేడాతో అంటే దాదాపు 287 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంది. ఒక వేళ ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తే పాక్‌కు అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఇంగ్లండ్ నిర్దేశించిన టార్గెట్‌ను 2.3 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. ఈ సమీకరణాలన్ని కష్టసాధ్యం కావడంతో న్యూజిలాండ్ అన్‌అఫీషియల్‌గా సెమీస్ చేరినట్లే అని అంతా ఫిక్స్ అయిపోయారు.
అయినా కూడా కొంతమంది పాకిస్థాన్ అభిమానులు ఇంకా తమ జట్టు సెమీస్‌కు చేరుతుందని, అద్భుతం జరుగుతుందని కలలు కంటున్నారు. అయితే వీరందరికి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ సెమీస్ అవకాశాలపై ఓ ప్రముఖ ఛానెల్‌లో జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడిన ఆయన పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఏం చేయాలో చెబుతూ నవ్వులు పూయించారు. ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాలంటే.. ముందుగా బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేసి.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఛేజింగ్‌కు రాకుండా వారి డ్రెస్సింగ్ రూమ్‌కు తాళాలు వేసేయాలని సెటైర్లు వేశారు. ఆశకైనా ఒక హద్దు ఉండాలంటూ వసీం ఆ విధంగా స్పందించారు.
వరల్డ్ కప్ టోర్నీ ఆరంభంలో హాట్ ఫేవరేట్లలో ఒకటిగా కనిపించిన పాకిస్థాన్.. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. అప్పట వరకు తమపై ఉన్న అంచనాలను నిజమే అనిపించేలా చేసింది. కానీ, ఒక్క సారి టీమిండియా మ్యాచ్ ఆడిన తర్వాత కానీ పాక్ జట్టు ఎంత డొల్లగా ఉందో తెలిసిరాలేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ పసికూనలా ఆడిన పాకిస్థాన్ ఆ తర్వాత దారుణంగా పలు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో పాటు అత్యంత దారుణంగా ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో కూడా ఓటమి పాలైంది. అక్కడితో ఇక పాకిస్థాన్ పని అయిపోయినట్లే అని అంతా భావించారు. కానీ, కొన్ని సమీకరణాలతో ఇంకా పాకిస్థాన్‌కు అవకాశాలు ఉన్నాయి. మరి ఏదో అద్భుతం జరిగి పాకిస్థాన్ సెమీస్ చేరితే.. ఇండియా వర్సెస్ పాక్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు. మరి పాక్‌పై వసీం అక్రమ్ వేసిన సెటైర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wasim Akram said, “Pakistan should bat first against England and post runs, then lock the England team in the dressing room and get them timed out”. (A Sports). pic.twitter.com/0bYBuoy09I
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2023