SNP
SNP
ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ జరగనుంది. ఇప్పటికే 7 సార్లు టీమిండియా, 6 సార్లు శ్రీలంక ఆసియా కప్‌ను గెలిచాయి. మరోసారి ఈ రెండు జట్లు టైటిల్ పోరుకు సిద్ధం అవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఉన్న లంక ఈ సారి కప్ కొట్టి.. టీమిండియా 7 కప్పులు రికార్డును సమం చేయాలని చూస్తుంటే.. టీమిండియా టైటిల్స్ సంఖ్యను మరింత పెంచాలనే పట్టుదలతో బరిలోకి దిగనున్నాయి. పైగా వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఆసియా కప్ గెలిస్తే వచ్చే కిక్కే వేరు. ఆటగాళ్లలో ఎంతో ఉత్సాహం నింపుతుంది. ఇలాంటి ఫైనల్‌ను ఎలాగైన గెలవాలని రెండు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి.
అయితే.. సూపర్ 4 స్టేజ్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయ సాధించినప్పటికీ.. లంక ఓడించేపనిచేసింది. బౌలర్ల రాజ్యంగా సాగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అంచులకు వెళ్లొచ్చి కొద్దిలో గెలుపును అందుకుంది. లంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. మళ్లీ సేమ్ పిచ్‌పై ఫైనల్ జరుగుతుండటంతో టీమిండియా మరింత పటిష్టమైన టీమ్‌తో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ క్రమంలో టీమిండియా యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను భారత్ నుంచి శ్రీలంకకు పిలిపించినట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. అక్షర్ పటేల్ పోరాటంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా అక్షర్ గాయపడినట్లు తెలుస్తుంది. కీలకమైన ఫైనల్‌కు ముందు స్పిన్ ఆల్‌రౌండర్ గాయపడటంతో.. స్పిన్ ట్రాక్‌పై మూడో స్పిన్నర్ కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. వాషింగ్టన్ సుందర్‌ను పిలిపిస్తున్నట్లు తెలుస్తుంది. అదే నిజమైతే.. శ్రీలంకతో జరగనున్న ఆసియా కప్ ఫైనల్‌లో సుందర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్, జడేజాతో పాటు సుందర్ మూడో స్పిన్నర్ కమ్ ఆల్‌రౌండర్‌గా ఆడే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
JUST IN: Washington Sundar is being flown to Colombo as a reinforcement for the Indian side ahead of the Asia Cup final on Sunday.
Cricbuzz understands that he’ll be replacing Axar Patel, who sustained multiple injuries while batting in the game against Bangladesh on Friday.… pic.twitter.com/Ejz0nMThDl
— Cricbuzz (@cricbuzz) September 16, 2023
ఇదీ చదవండి: Asia Cup: కోహ్లీ లేకుండా బంగ్లాదేశ్‌ను కూడా ఓడించలేమా?