iDreamPost

Asia Cup: కోహ్లీ లేకుండా బంగ్లాదేశ్‌ను కూడా ఓడించలేమా?

  • Published Sep 16, 2023 | 9:20 AMUpdated Sep 16, 2023 | 11:26 AM
  • Published Sep 16, 2023 | 9:20 AMUpdated Sep 16, 2023 | 11:26 AM
Asia Cup: కోహ్లీ లేకుండా బంగ్లాదేశ్‌ను కూడా ఓడించలేమా?

ఆసియా కప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్‌ 4 చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌ నామమాత్రమే అయినా.. మరీ బంగ్లాదేశ్‌పై కూడా ఓడిపోవడం భారత క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత నామ్‌కే వాస్త మ్యాచ్‌ అయినా.. ఫైనల్‌కి ముందు బుస్ట్‌ అప్‌ ఇచ్చేలా ఉండాలి కానీ, ఇలా ఓటమితో నిరుత్సాహంతో ఫైనల్‌కు వెళ్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓడినా, గెలిచినా.. పెద్దగా ప్రభావం పడదని.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టులో భారీ మార్పులు చేశాడు. కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, సిరాజ్‌, బుమ్రాలకు రెస్ట్‌ ఇచ్చి.. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, షమీలను టీమ్‌లోకి తీసుకున్నాడు. నేపాల్‌ లాంటి పసికూనపై కూడా ప్రయోగం చేయని రోహిత్‌ శర్మ.. బంగ్లాదేశ్‌ను చాలా లైట్‌ తీసుకుని దెబ్బతిన్నాడు.

కోహ్లీ లేకుండా గెలవలేరా??
అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీకి రెస్ట్‌ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలన్నా లేదా జట్టులోని ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెస్ట్‌ ఇవ్వాలన్నా.. తరచు గాయపడే ఆటగాళ్లకు రెస్ట్‌ ఇవ్వాలని కానీ, విరాట్‌ కోహ్లీ లాంటి సూపర్‌ ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌కు ఎలా రెస్ట్‌ ఇస్తారని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. తన 15 ఏళ్ల కెరీర్‌లో కోహ్లీ ఒక్కసారి కూడా గాయంతో మ్యాచ్‌కు దూరం కాలేదు. అలాంటి ఆటగాడికి రెస్ట్‌ అవసరమా.. మంచి రిథమ్‌లో ఉన్న కోహ్లీ మ్యాచ్‌ గ్యాప్‌ రావడం వల్ల ఆ రిథమ్‌ను కోల్పోతే.. అల్టిమేట్‌గా టీమ్‌కే కదా నష్టం జరిగేదని అంటున్నారు. నిజంగా రెస్ట్‌ తీసుకోవాలంటే.. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు రెస్ట్‌ తీసుకోవాలని అంటున్నారు. కోహ్లీ సెంచరీల రికార్డును అడ్డుకోవడానికి కూడా రోహిత్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు.

కోహ్లీ లేకుండ ఆడిన టీమిండియా మ్యాచ్‌ ఓడిపోవడంతో.. కోహ్లీ లేకుండా టీమిండియా గెలవలేదని.. అంత జంగ్‌ అంటూ కొంతమంది కోహ్లీ అభిమానులు సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. బంగ్లాదేశ్‌ లాంటి టీమ్‌పై కూడా కోహ్ల లేకుండా టీమిండియా గెలవలేకపోతుందని అంటున్నారు. నిజంగానే కోహ్లీ లేకపోవడంతో.. టాపార్డర్‌ బలహీనంగా ఉంది. రోహిత్‌ శర్మ, గిల్‌ మంచి స్టార్ట్‌ ఇస్తే.. దాన్ని కోహ్లీ నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్తాడు. ఒకవేళ ఓపెనర్లలో ఏ ఒక్కరైనా త్వరగా అవుటైతే.. ఇన్నింగ్స్‌ను నిలబెడతాడు. ఇలా టీమ్‌ను ఆదుకోవడంలో కోహ్లీని మెచ్చుకోవ్సాలిందే. కోహ్లీ టీమ్‌లో లేకపోవడం పెద్ద మైనసే కానీ, నామమాత్రపు మ్యాచ్‌ కావడంతో రోహిత్‌ను పెద్దగా తప్పుపట్టాల్సిన పనిలేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అప్పట్లో సచిన్, ఇప్పుడు గిల్.. టీమిండియా ఓటమికి అదే కారణమా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి