iDreamPost
android-app
ios-app

వీళ్లు మ్యాచ్ లు గెలిస్తే.. వాళ్లు ట్రోఫీలు గెలుస్తారు! టీమిండియాపై పాక్ దిగ్గజం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 01:46 PM, Mon - 30 October 23

ఇంగ్లాండ్ పై విజయం తర్వాత పాక్ దిగ్గజం, మాజీ ప్లేయర్ వకార్ యూనిస్ టీమిండియా ఆటగాళ్లపై, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇంగ్లాండ్ పై విజయం తర్వాత పాక్ దిగ్గజం, మాజీ ప్లేయర్ వకార్ యూనిస్ టీమిండియా ఆటగాళ్లపై, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.

  • Author Soma Sekhar Published - 01:46 PM, Mon - 30 October 23
వీళ్లు మ్యాచ్ లు గెలిస్తే.. వాళ్లు ట్రోఫీలు గెలుస్తారు! టీమిండియాపై పాక్ దిగ్గజం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వరల్డ్ కప్ 2023లో టీమిండియా భీకరఫామ్ లో ఉంది. కంటిన్యూస్ గా విజయాలు సాధిస్తూ.. ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తు దూసుకెళ్తోంది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కలిసికట్టుగా రాణించి.. అద్భుత విజయాన్ని జట్టుకు అందించారు. దీంతో టీమిండియాపై వరల్డ్ వైడ్ గా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంగ్లాండ్ పై విజయం తర్వాత పాక్ దిగ్గజం, మాజీ ప్లేయర్ వకార్ యూనిస్ టీమిండియా ఆటగాళ్లపై, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ అద్భుతమైన నాయకుడు అంటూ కితాబిచ్చాడు.

టీమిండియాకు వరల్డ్ కప్ లో ఎదురులేకుండా పోయింది. వరుస మ్యాచ్ ల్లో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 230 పరుగుల లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకుంది టీమిండియా. దీంతో మరోసారి తన బలమేంటో వరల్డ్ కప్ లో ప్రత్యర్థులకు తెలియజెప్పింది. ఇక ఈ విజయం తర్వాత టీమిండియాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా పాక్ దిగ్గజం, మాజీ ఆటగాడు వకార్ యూనిస్ సైతం టీమిండియా ఆటకు ఫిదా అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా భారత ఆటగాళ్లను ప్రశంసించాడు.

“సాధారణంగా బ్యాటర్లు మ్యాచ్ లను గెలిపిస్తే.. బౌలర్లు మాత్రం ట్రోఫీలు గెలిపిస్తారు. ప్రస్తుతం టీమిండియాలో అదే జరుగుతోంది. ఇక రోహిత్ శర్మ అద్భుతంగా జట్టును ముందుండి నడుపుతున్నాడు. అతడో గొప్ప సారథి. ప్రస్తుతం భారత జట్టు శత్రుదుర్బేద్యంగా ఉంది” అంటూ కితాబిచ్చాడు ఈ పాక్ దిగ్గజం. 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడటంలో బౌలర్లు కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే వకార్ ఈ వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది. మరి పాక్ దిగ్గజం చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.