మరికొన్ని గంటల్లో మినీ వరల్డ్ కప్ గా పిలువబడే ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లు అన్ని తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు వెన్నముకగా ఉండి నడిపిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా ఆసియా కప్ కు దూరం అయ్యాడు. ఇటీవలే లంక ప్రీమియర్ లీగ్ లో అన్ని విభాగాల్లో దుమ్మురేపి తన జట్టును ఛాంపియన్ గా నిలిపాడు హసరంగా. వరల్డ్ కప్ ముంగిట కీలకమైన ఆసియా కప్ కు హసరంగా దూరం కావడం లంకకు పెద్ద దెబ్బనే చెప్పాలి.
వనిందు హసరంగా.. ప్రస్తుత వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా ప్రపంచ క్రికెట్ పై తన ముద్రవేశాడు. తన అద్భుతమైన లెగ్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో సిద్దహస్తుడు హసరంగా. ఇక ఇటీవలే జరిగిన లంక ప్రీమియర్ లీగ్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా, లీడింగ్ స్కోరర్ గా, టోర్నీలో అత్యధిక సిక్స్ లు, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లతో పాటుగా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులను కైవసం చేసుకున్నాడు. తాను సారథిగా వ్యవహరించిన జట్టును ఛాంపియన్ గా నిలిపాడు.
ఇక ప్రస్తుతం హసరంగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఈ ఆసియా కప్ లో హసరంగా నుంచి ప్రత్యర్థి బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడు తొడ గాయంతో ఆసియా కప్ మెుత్తానికే దూరం అయ్యాడు. అతడి తొడ గాయం మనకపోవడంతో.. టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ఇది శ్రీలంకకు భారీ షాక్ అనే చెప్పాలి. గత ఆసియా కప్ లంక గెలవడంలో హసరంగాదే కీలక పాత్ర. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన ఇతడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
Wanindu Hasaranga is still recovering from a grade two strain in the thigh and has not yet regained full fitness. pic.twitter.com/JMq7nGwyqO
— CricTracker (@Cricketracker) August 29, 2023