iDreamPost

ఆసియా కప్ బెస్ట్ బౌలర్స్ లిస్ట్ లో సచిన్! ఇది ఊహించని రికార్దు!

  • Author Soma Sekhar Published - 05:42 PM, Tue - 29 August 23
  • Author Soma Sekhar Published - 05:42 PM, Tue - 29 August 23
ఆసియా కప్ బెస్ట్ బౌలర్స్ లిస్ట్ లో సచిన్! ఇది ఊహించని రికార్దు!

సచిన్.. క్రికెట్ దేవుడిగా, రికార్డుల రారాజుగా వరల్డ్ క్రికెట్ ను కొన్ని దశాబ్దాలపాటు తన ఏకఛత్రాదిపత్యంలో ఏలాడు. సచిన్ అంటే అందరికి గుర్తు వచ్చేది బ్యాటింగ్ లో రికార్డులు మాత్రమే. కానీ బౌలింగ్ లో కూడా సచిన్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడని చాలా తక్కువ మందికే తెలుసు. ఇక ఆగస్టు 30 నుంచి మినీ వరల్డ్ కప్ గా పేరుగాంచిన ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ ఆసియా కప్ లో ఎన్నో రికార్డులు సచిన్ పేరిటే ఉన్నాయి. అయితే బౌలింగ్ లో ఆసియా కప్ బెస్ట్ బౌలర్స్ జాబితాలో సచిన్ ఉండటం విశేషం. ఇది అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. మరి ఆ రికార్డు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

అది 2004 ఆసియా కప్ టోర్నమెంట్. ఈ టోర్నీని శ్రీలంక గెలుచుకుంది. ఫైనల్లో టీమిండియాను 25 పరుగుల తేడాతో ఓడించి.. టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఇక ఈ టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. ఫైనల్లో బ్యాటింగ్ లో 74 పరుగులు చేయడంతో పాటుగా బౌలింగ్ లో 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. కానీ ఇండియాను మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే ఈ టోర్నీలో బెస్ట్ బౌలర్స్ జాబితాలో నిలిచాడు సచిన్. ఆసియా కప్ హిస్టరీ ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ చోటు దక్కించుకున్నాడు. 2004 ఆసియా కప్ సీజన్ లో టీమిండియా బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అతడు ఈ సీజన్ లో 14 వికెట్లతో సత్తా చాటగా.. సచిన్ కూడా ఇదే సీజన్ లో 12 వికెట్లు నేల కూల్చి హిస్టరీ క్రియేట్ చేశాడు.

కాగా.. ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు మాత్రం శ్రీలంక మిస్టరీ బౌలర్ అజంతా మెండీస్ పేరిట ఉంది. అతడు 2008 ఆసియా కప్ టోర్నీలో 17 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. కాగా.. ఆసియా కప్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సచిన్ మూడో స్థానంలో ఉండటం విశేషం. సచిన్ రికార్డు అనగానే.. అందరు బ్యాటింగ్ రికార్డే అనుకుంటారు. కానీ అతడి బౌలింగ్ రికార్డుల గురించి పెద్దగా వారికి తెలీదు. మరి ఆసియా కప్ హిస్టరీలో సచిన్ క్రియేట్ చేసిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి