Brian Lara Controversy: బ్రియన్ లారా బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే.. వివ్ రిచర్డ్స్ ఫైర్!

బ్రియన్ లారా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు వివ్ రిచర్డ్స్, కార్ల్ హూపర్. మరి ఇంతకీ అంత పెద్ద తప్పు లారా ఏం చేశాడు? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రియన్ లారా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు వివ్ రిచర్డ్స్, కార్ల్ హూపర్. మరి ఇంతకీ అంత పెద్ద తప్పు లారా ఏం చేశాడు? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా ఎప్పుడూ టీమిండియా ఆటగాళ్లను పొగుడుతూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా కూడా న్యూస్ లో నిలిచాడు. అయితే ఈసారి వివాదంతో తెరపైకి వచ్చాడు. లారా తన పుస్తకంలో రాసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా వివ్ రిచర్డ్స్ కు కోపం వచ్చింది. దాంతో వెంటనే లారా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రియన్ లారా ఓ పుస్తకం రాశాడు. ఆ బుక్ పేరు ‘లారా, ది ఇంగ్లండ్ క్రానికల్స్’. ఈ పుస్తకంలో లారా ఇద్దరు వెస్టిండీస్ మాజీ ఆటగాళ్ల గురించి ప్రస్తావించాడు. అందులో ఒకరు వివ్ రిచర్డ్స్ కాగా.. మరోకరు కార్ల్ హూపర్. లారా తన పుస్తకంలో.. వివ్ రిచర్డ్స్ కార్ల్ హూపర్ ను వేధించే వాడని, అదీకాక తనను కూడా 3 వారాలకు ఒకసారి వేధించేవాడని పుస్తకంలో రాసుకొచ్చాడు. రిచర్డ్స్ గొంతు భయంకరంగా ఉంటుంది, మీరు గట్టిగా లేకపోతే దాన్ని స్వీకరించలేరు. ఇది నాపై ఎప్పుడూ ప్రభావం చూపనప్పటికీ.. కార్ల్ హూపర్ మాత్రం రిచర్డ్స్ కు దూరమైయ్యాడు అంటూ ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. ఈ రాతలపై వివ్ రిచర్డ్స్ ఆగ్రహంగా ఉన్నాడు.

”బ్రియన్ లారా తన పుస్తకంలో రాసిన వ్యాఖ్యలు పూర్తిగా పచ్చి అబద్దం. నేను కార్ల్ హూపర్ ను, లారాను వేధించేవాడినని చేసిన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. నేను వారిపై దూకుడుగా వ్యవహరించాను అని చెప్పడం పూర్తిగా అబద్దం. ఈ రాతలపై లారా వెంటనే నాకు  బహిరంగ క్షమాపణలు చెప్పాలి” అంటూ ఫైర్ అయ్యాడు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్. మరి ఈ వివాదంపై లారా ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments