iDreamPost
android-app
ios-app

Sanath Jayasuriya: ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ప్లేయర్లు వారే.. వారి తర్వాతే ఎవరైనా: జయసూర్య

  • Published Jul 25, 2024 | 2:23 PM Updated Updated Jul 25, 2024 | 2:23 PM

ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరే అత్యుత్తమ ప్లేయర్లు అంటూ శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఓ ఇద్దరు స్టార్ క్రికెటర్ల పేర్లు చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరే అత్యుత్తమ ప్లేయర్లు అంటూ శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఓ ఇద్దరు స్టార్ క్రికెటర్ల పేర్లు చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 25, 2024 | 2:23 PMUpdated Jul 25, 2024 | 2:23 PM
Sanath Jayasuriya: ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ప్లేయర్లు వారే.. వారి తర్వాతే ఎవరైనా: జయసూర్య

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది అత్యుత్తమైన ప్లేయర్లు ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. ఇక సందర్భం వచ్చినప్పుడు కొంత మంది దిగ్గజ ఆటగాళ్లు తమకు ఇష్టమైన క్రికెటర్ల పేర్లు వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్, తాత్కాలిక హెడ్ కోచ్ సనత్ జయసూర్య కూడా తన మనసులో మాటను బయటపెట్టాడు. ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరే అత్యుత్తమ ప్లేయర్లు అంటూ ఇద్దరు ఇండియన్స్ పేర్లను చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది. లంకతో జులై 27 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్ లు భారత్ ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడి చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో నెట్స్ లో శ్రమిస్తున్నారు భారత ప్లేయర్లు. టీ20లకు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వగా.. వన్డేలకు మాత్రం సీనియర్లను జూనియర్లు కలిసి ఆడనున్నారు.

ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం, తాత్కాలిక హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యుత్తమ ప్లేయర్లు అని, వారి తర్వాతే ఎవరైనా అని ప్రశంసల్లో ముంచెత్తాడు. ప్రస్తుతం క్రికెట్ ను ఈ జోడీ ఏలుతుందని కొనియాడాడు. మరికొద్ది రోజుల్లో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జయసూర్య ఈ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. మరి లంక దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş