iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్య చేసిన సెహ్వాగ్‌!

  • Published Nov 10, 2023 | 1:32 PM Updated Updated Nov 10, 2023 | 1:32 PM

ఛాన్స్‌ దొరికితే పాకిస్థాన్‌పై పంచులు వేసే టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ తాజాగా మరో అదిరిపోయే పంచ్‌తో వేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 నుంచి పాకిస్థాన్‌కు వీడ్కోలు చెబుతూ ఓ పంచ్‌ ట్వీట్‌ను చేశాడు. అదేంటో దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం..

ఛాన్స్‌ దొరికితే పాకిస్థాన్‌పై పంచులు వేసే టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ తాజాగా మరో అదిరిపోయే పంచ్‌తో వేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 నుంచి పాకిస్థాన్‌కు వీడ్కోలు చెబుతూ ఓ పంచ్‌ ట్వీట్‌ను చేశాడు. అదేంటో దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 10, 2023 | 1:32 PMUpdated Nov 10, 2023 | 1:32 PM
పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్య చేసిన సెహ్వాగ్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 దాదాపు చివరి దశకు చేరుకుంది. లీగ్‌ దశలో ఇంకో నాలుగు మ్యాచ్‌లు, రెండు సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు, 19న ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం శ్రీలంకపై విజయంతో కివీస్‌ దాదాపు సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఏదో అద్భుతం చేస్తే తప్పా.. న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్త్‌కు ఢోకా లేదు. పాకిస్థాన్‌ మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌ చేరాలంటే.. ఇంగ్లండ్‌ను 260కి పైగా పరుగుల భారీ తేడాతో విజయం సాధించాలి. ఛేజింగ్‌ చేయాల్సి వస్తే మాత్రం పాకిస్థాన్‌ ఇంటి బాట పట్టడం ఖాయం.

ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌, పాకిస్థాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌ జిందాభాగ్‌ అంటూ వీరూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. అందరూ దాన్ని ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అన్నాడా? ఏంటి అని కంగారు పడ్డారు. కానీ, రెండో సారి చదివితే అర్థమైంది. అది పాకిస్థాన్‌ జిందాబాద్‌ కాదు.. పాకిస్థాన్‌ జిందాభాగ్‌ అని. జిందాభాగ్‌ అంటే ప్రాణాలతో పారిపోండి అని అర్థం. శ్రీలంకపై న్యూజిలాండ్‌ ఓడిపోతే.. సెమీస్‌లో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూసేందుకు అవకాశం ఉంటుందని చాలా మంది ఆశపడ్డారు. టీమిండియా, పాకిస్థాన్‌ను మరోసారి కసితీరా ఓడిస్తుంటే చూడాలని క్రికెట్‌ అభిమానుల ఎదురుచూశారు. అలాగే సెహ్వాగ్‌ కూడా ఇండియా-పాక్‌ పోరు కోసం వెయిట్‌ చేసినట్లు ఉన్నాడు.

కానీ, సెమీస్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకను న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. దీంతో పాకిస్థాన్‌ సెమీస్‌ ఆశలు దాదాపు గల్లంతు అయ్యాయి. లంకపై కివీస్‌ విజయం తర్వాత సెహ్వాగ్‌.. ‘బైబై పాకిస్థాన్‌’ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. దానికి పాకిస్థాన్‌ జిందాభాగ్‌.. ఇంటికి ఫ్టైట్‌లో క్షేమంగా వెళ్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటే సెహ్వాగ్‌.. క్రికెట్‌కు సంబంధించిన విషయాల గురించి చాలా ఫన్నీగా స్పందిస్తూ ఉంటాడు. ఇప్పుడు పాక్‌పై కూడా మంచి పంచ్‌ వేశాడు. మరి సెహ్వాగ్‌ చేసిన ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ​