iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఆ బౌలర్లకు కోహ్లీ అంటే భయం లేదు.. విరాట్ పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

  • Published Apr 29, 2024 | 3:53 PM Updated Updated Apr 29, 2024 | 3:53 PM

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ బౌలర్లకు కోహ్లీ అంటే ఎలాంటి భయం లేదని వ్యాఖ్యానించాడు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ బౌలర్లకు కోహ్లీ అంటే ఎలాంటి భయం లేదని వ్యాఖ్యానించాడు.

Virat Kohli:  ఆ బౌలర్లకు కోహ్లీ అంటే భయం లేదు.. విరాట్ పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ 2024 సీజన్ లో పరుగులు సునామీ సృష్టిస్తున్నాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ఈ సీజన్ లో ఆడిన 10 మ్యాచ్ ల్లో 500 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ విరాట్ బ్యాటింగ్ పై మాజీ దిగ్గజాలతో పాటుగా క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. స్లో బ్యాటింగ్ అంటూ, స్ట్రైక్ రేట్ తక్కువ ఉందంటూ.. విమర్శిస్తున్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు కోహ్లీ. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ బౌలర్లకు కోహ్లీ అంటే ఎలాంటి భయం లేదని వ్యాఖ్యానించాడు.

విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయాలంటే వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం భయపడతారు. ఈ విషయాన్ని కొందరు దిగ్గజ బౌలర్లు కూడా బాహటంగానే ఒప్పుకున్నారు. అంతలా విరాట్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పరుగుల వరదపారిస్తున్నాడు.  అలాంటి విరాట్ బ్యాటింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ..

“విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ ప్లేయర్, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం అతడి బ్యాటింగ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇక కోహ్లీకి బౌలింగ్ వేయడానికి ఏ స్పిన్ బౌలర్ కూడా భయపడడు. ఎందుకంటే? స్పిన్ లో విరాట్ భారీ షాట్స్ ఆడలేడని వారికి తెలుసు. ఎక్కడ బాల్ వేస్తే కొడతాడో కూడా తెలుసు. అందుకే స్పిన్ బౌలర్లకు విరాట్ అంటే భయం లేదు” అంటూ ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశాడు వీరూ భాయ్. అదీకాక టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీని 3వ నంబర్ లో బ్యాటింగ్ దింపాలని సూచించాడు. ఓపెనర్ గా విరాట్ అవసరం లేదని తన దృష్టిలో రోహిత్-జైస్వాల్ ఓపెనర్లుగా దిగాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి కోహ్లీకి స్పిన్ బౌలర్లు భయపడరు అంటూ వీరూ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.