iDreamPost

IPL 2024లో భారీ స్కోర్లకు కారణం ‘ఎండలా?’.. క్యూరేటర్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు!

ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డ్ స్థాయిలో భారీ స్కోర్లు నమోదు కావడానికి కారణం అధిక ఉష్ణోగ్రతలని ఓ పిచ్ క్యూరేటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వింత రీజన్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డ్ స్థాయిలో భారీ స్కోర్లు నమోదు కావడానికి కారణం అధిక ఉష్ణోగ్రతలని ఓ పిచ్ క్యూరేటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వింత రీజన్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024లో భారీ స్కోర్లకు కారణం ‘ఎండలా?’.. క్యూరేటర్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు!

IPL 2024లో పరుగుల వరదపారుతోంది. మునుపెన్నడూ లేని విధంగా భారీ స్కోర్లు ఈ సీజన్ లో నమోదు అవుతున్నాయి. ఒక టీమ్ ను మించి మరో టీమ్ దంచికొడుతూ.. రికార్డ్ స్కోర్లను నమోదు చేస్తోంది. అయితే ఇలా భారీ స్కోర్లు నమోదు కావడానికి కారణం  బౌండరీ లైన్ దగ్గరగా ఉండటం అని కొందరు వాదిస్తుండగా.. తాజాగా మరో వింత రీజన్ బయలుదేరింది. అదేంటంటే? ఈ సీజన్ భారీ స్కోర్లు నమోదు కావడానికి కారణం అధికంగా ఉన్న ‘ఎండలట’. ఈ విషయంపై పిచ్ క్యూరేటర్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఐపీఎల్ సీజన్ బౌలర్లకు ఓ పీడకలనే చెప్పాలి. ఎందుకుంటే? బ్యాటర్లు మంచినీళ్లు తాగినంత ఈజీగా 250కి పైగా స్కోర్లను నమోదు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన ఆర్సీబీ రికార్డ్.. ఈ ఒక్క సీజన్ లోనే ఇప్పటి వరకు మూడుసార్లు బద్దలు అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా.. ఇంతలా పరుగుల వరదపారడంపై మాజీ క్రికెటర్లు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. బ్యాట్ కు బంతికి సమతూకం ఉంటేనే మ్యాచ్ లు ప్రేక్షకులకు మజాను ఇస్తాయని వారు పేర్కొంటున్నారు. అలాంటి ఇంత ఈజీగా భారీ స్కోర్లు సాధించడంతో ప్రేక్షకులకు సైతం బోర్ కొడుతుందని వారి వాదన.

ఇదిలా ఉండగా.. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇంతలా భారీ స్కోర్లు నమోదు కావడానికి కారణం అధిక ఉష్ణోగ్రతలేనట. ఈ మాట నేను చెప్పింది కాదు. ఓ పిచ్ క్యూరేటర్ చెప్పింది. సాధారణంగా ఇండియాలో పిచ్ లు బ్యాట్ కు బంతికి సమతూకంగా తయ్యారుచేసినవి. అందుకే పిచ్ పొడిగా ఉన్నప్పుడు స్పిన్నర్లకు, తేమగా ఉన్నప్పుడు పేసర్లకు అనుకూలిస్తూ ఉంటాయి. దీంతో వారికి కావాల్సిన స్పిన్, సీమ్ ను రాబట్టేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణం పిచ్ మార్పులకు కారణమని ఓ క్యూరేటర్ చెప్పుకొచ్చాడు.

“ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పిచ్ పై తేమ ఉండటం లేదు. టీ20 మ్యాచ్ లకు తగిన తేమ ఉండకపోవడంతో.. పిచ్ స్వభావం పూర్తిగా మారిపోతోంది. దీంతో బ్యాటర్లకు అది స్వర్గధామంగా మారుతోంది. గత సీజన్ లో ఈ పరిస్థితులు లేవు. ఇక ఇలాంటి పిచ్ ల వల్ల పేస్ బౌలర్లు ఎక్కువగా నష్టపోతున్నారు. స్పిన్నర్లు మిడిల్ ఓవర్లో బౌలింగ్ వేస్తారు కాబట్టి వారిపై తక్కువ ప్రభావం ఉంటుంది”  అంటూ ఆ క్యూరేటర్ చెప్పుకొచ్చాడు. మరి ఈ ఐపీఎల్ సీజన్ లో భారీ స్కోర్లు నమోదు కావడానికి కారణం పెరుగుతున్న ఎండలా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి