iDreamPost

హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మలపై వేటు తప్పదు.. సెహ్వాగ్ సంచలన కామెంట్స్!

హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మల ఐపీఎల్ కెరీర్ పై సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మల ఐపీఎల్ కెరీర్ పై సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మలపై వేటు తప్పదు.. సెహ్వాగ్ సంచలన కామెంట్స్!

ఐపీఎల్ 2024 సీజన్ లో ఆట కంటే ఇతర గొడవలతో ఎక్కువ వార్తల్లో నిలిచిన జట్టు ఏదైనా ఉందంటే? అది ముంబై ఇండియన్స్ అనే చెప్పాలి. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికంటే ముందే సంచలనం సృష్టించింది ముంబై ఇండియన్స్. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని, గుజరాత్ నుంచి తీసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడంతో.. ఆ జట్టుకు దురదృష్టం అంటుకున్నట్లు అయ్యింది. ఈ సీజన్ లో ఇంటిదారి పట్టిన తొలి టీమ్ గా ముంబై అపకీర్తిని మూటగట్టుకుంది. కాగా.. ఈ సీజన్ లో తన చివరి మ్యాచ్ లక్నోతో నేడు(శుక్రవారం) ఆడనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్ పై సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ డాషింగ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్.

ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో చివరి మ్యాచ్ ఆడనుంది. లక్నోతో నేడు(శుక్రవారం) వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ పై, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలపై సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. ” ఈ సీజన్ ముగిసిన తర్వాత ప్రతి జట్టు నలుగు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలను విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లను కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వారు గొప్పగా రాణిస్తేనే టీమ్ విజయం సాధిస్తుంది. ఈ సీజన్ లో రోహిత్ ఓ సెంచరీ సాధించాడు, కానీ ఆ మ్యాచ్ లో మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ఓడిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు వీరూ భాయ్.

ఇక ఈ సీజన్ లో ఇషాన్ కిషన్ కొన్ని మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నప్పటికీ.. పవర్ ప్లేలోనే వికెట్ కోల్పోతున్నాడని విమర్శించాడు సెహ్వాగ్. కాగా.. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ముంబై ఇండియన్స్ లో రాణించారని వాళ్లే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ లు అని వారిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటారని వీరూ భాయ్ పేర్కొన్నాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలను టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఏకీభవించాడు. మరి పాండ్యా, రోహిత్ లను ముంబై రిటైన్ చేసుకోదు అన్న సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి