ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌పై సెహ్వాగ్‌ సెటైర్లు!

ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌పై సెహ్వాగ్‌ సెటైర్లు!

సిరీస్ ఓడిపోయి బాధలో ఉన్న ఇంగ్లండ్ టీమ్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.

సిరీస్ ఓడిపోయి బాధలో ఉన్న ఇంగ్లండ్ టీమ్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.

ఇంగ్లండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను చిత్తుచేసింది. కేవలం మూడురోజుల్లోనే మ్యాచ్ ను ముగించారు టీమిండియా ప్లేయర్లు. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టిగా రాణించి అద్భుతమైన విజయాన్ని నమోదుచేశారు. ఇక ఈ విజయంతో టీమిండియాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు బజ్ బాల్ అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ టీమ్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.

వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. పాకిస్థాన్ ప్లేయర్లపై అతడు విసిరే వ్యంగ్యాస్త్రాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే మిగతా టీమ్స్ పై కూడా తనదైనశైలిలో సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా టీమిండియాపై ఐదు టెస్ట్ ల సిరీస్ ను 4-1తో ఓడిపోయింది ఇంగ్లండ్ టీమ్. దీంతో మరోసారి తనదైన స్టైల్లో ఇంగ్లీష్ టీమ్ పై సెటైర్లు వేశాడు ఈ మాజీ డ్యాషింగ్ బ్యాటర్. ట్విట్టర్ వేదికగా ఇంగ్లండ్ టీమ్ ను ఏకిపారేశాడు.

“బజ్ బాల్ అంటూ గత కొంతకాలంగా విర్రవీగుతున్న ఇంగ్లండ్ టీమ్ కు దమ్కీ ఇచ్చింది టీమిండియా. దాంతో బజ్ బాల్ బద్దలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమ్ కు ఇది సరిపోయే ఆటకాదు. పిచ్చికి కూడా ఓ పద్దతి ఉంటుంది. ఈ సిరీస్ లో రెండో టెస్ట్ తర్వాత ఇంగ్లండ్ టీమ్ నెర్వెస్ అయ్యింది, క్లూలెస్ గా కనిపించింది. అదీకాక కెప్టెన్ గా బెన్ స్టోక్స్ ఘోరంగా విఫలం అయ్యాడు. ఇంగ్లండ్ టీమ్ బజ్ బాల్ అనే భ్రమలో బతుకుతోంది. వారు అనుకరించే స్ట్రాటజీలో విజయం సాధించాలంటే? వారికి తీవ్రమైన పిచ్చి ఉండాలి” అంటూ సెటైర్లు వేశాడు వీరూ భాయ్. దీంతో పాపం ఓటమి బాధలో ఉన్న టీమ్ పై ఎందుకు సర్ సెటైర్లు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంగ్లండ్ టీమ్ పై సెహ్వాగ్ సెటైర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: 112 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ రేర్ రికార్డు! ఎవ్వరి తరం కాలేదు!

Show comments