iDreamPost
android-app
ios-app

Virender Sehwag: వార్నర్ నేనిచ్చిన సలహా విని నవ్వాడు.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jan 03, 2024 | 12:49 PM Updated Updated Jan 03, 2024 | 12:49 PM

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ సలహా ఇచ్చాడట. అది విని నవ్వుకున్నాడట వార్నర్. మరి ఇంతకీ సెహ్వాగ్ ఇచ్చిన సలహా ఏంటి?

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ సలహా ఇచ్చాడట. అది విని నవ్వుకున్నాడట వార్నర్. మరి ఇంతకీ సెహ్వాగ్ ఇచ్చిన సలహా ఏంటి?

Virender Sehwag: వార్నర్ నేనిచ్చిన సలహా విని నవ్వాడు.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సాధారణంగా క్రికెటర్లు తమ సహచరులకు, యువ ఆటగాళ్లకు తమ అనుభవాలను వివరిస్తూ ఉంటారు. వారికి బ్యాటింగ్ టెక్నిక్స్ తో పాటుగా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు సైతం టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ సలహా ఇచ్చాడట. అది విని నవ్వుకున్నాడట వార్నర్. ఈ విషయాన్ని స్వయంగా వీరూ భాయ్ వెల్లడించాడు. మరి ఇంతకీ సెహ్వాగ్ ఇచ్చిన సలహా ఏంటి? వార్నర్ ఎందుకు నవ్వాడు. ఆ వివరాల్లోకి వెళితే..

డేవిడ్ వార్నర్.. ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ తో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు వార్నర్. అతడికి ఇది చివరి సిరీస్ అని మనందరికి తెలిసిందే. తాజాగా జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తర్వాత అతడు టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలకనున్నాడు. కాగా.. ఇప్పటికే వన్డేలకు కూడా వార్నర్ గుడ్ బై చెప్పి అందరిని షాక్ కు గురిచేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్, విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వార్నర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

sehwag comments on warner

“ఒకానొక సందర్భంలో నేను డేవిడ్ వార్నర్ కు ఓ సలహా ఇచ్చాను. టెస్ట్ క్రికెట్ ను నువ్వు ఎంజాయ్ చెయ్.. క్రీజ్ లో కుదురుకుంటే రోజంతా నీకు పవర్ ప్లేనే. టీ20 క్రికెట్ లో లాస్ట్ లో కొన్ని ఓవర్లు మాత్రమే పవర్ ప్లే ఉంటుంది. ఇక్కడ అలా కాదు” అని నేను చెప్పగానే.. వార్నర్ గట్టిగా నవ్వాడు. కానీ నేను అలాగే చేస్తాను మీరు చూసి ఆనందించండి అని వార్నర్ అన్నట్లుగా సెహ్వాగ్ పేర్కొన్నాడు. మరి వార్నర్ కు వీరేంద్ర సెహ్వాగ్ సలహాలు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.