iDreamPost
android-app
ios-app

నిలబెట్టి బాబర్ పరువుతీసిన సెహ్వాగ్.. ఏమన్నాడంటే?

  • Author Soma Sekhar Published - 06:00 PM, Sun - 29 October 23

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం ను ఏకిపారేశాడు టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. అతడు నెం.1 బ్యాటర్ గా అనర్హుడని చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం ను ఏకిపారేశాడు టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. అతడు నెం.1 బ్యాటర్ గా అనర్హుడని చెప్పుకొచ్చాడు.

  • Author Soma Sekhar Published - 06:00 PM, Sun - 29 October 23
నిలబెట్టి బాబర్ పరువుతీసిన సెహ్వాగ్.. ఏమన్నాడంటే?

బాబర్ అజాం.. ప్రపంచ క్రికెట్ లో ఓ అరుదైన వ్యక్తి. ఎందుకంటే? అతడు అద్భుతంగా రాణించినా విమర్శల పాలవుతూ ఉంటాడు. విఫలమైనా అవే విమర్శలను ఎదుర్కొంటాడు. ఒక్కోసారి తన నోటిదూలతో తన ఫ్యాన్స్ చేతనే తిట్టించుకునే స్థాయికి దిగజారుతూ ఉంటాడు. ఎక్కువగా విరాట్ కోహ్లీతో పోల్చుకుంటూ.. తానే గొప్ప బ్యాటర్ ని అని విర్రవీగుతుంటాడు. అయితే గణాంకాల పరంగా మాత్రం బాబర్ గొప్పవాడనే చెప్పాలి. ప్రస్తుతం వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో 829 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఈ పాక్ సారథి. అయినప్పటికీ బాబర్ అంటే అందరికీ చిన్నచూపే. దానికి ఎన్నో కారణాలను ఎత్తి చూపుతున్నారు వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు. తాజాగా టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్, మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ నిలబెట్టి బాబర్ పరువుతీశాడు. అసలు అతడు నెం.1 బ్యాటర్ ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదన్నాడు.

బాబర్ అజాం.. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక గత కొంతకాలంగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో నెం.1 స్టేటస్ ను బాబర్ అనుభవిస్తున్నాడు. అయితే అతడు బ్యాటింగ్ లో నేపాల్, నెదర్లాండ్స్, శ్రీలంక, జింబాబ్వే లాంటి దేశాలపైనే రాణిస్తుంటాడు. మిగతా జట్లపై అంతగా రాణించడు. కాగా.. టీమిండియా బ్యాటర్ శుబ్ మన్ గిల్ నెం.1 ర్యాంకుకు చేరువగా వచ్చిన తర్వాత నుంచి ఫెయిల్ అవుతుండటంతో.. బాబర్ తన ర్యాంక్ ను కాపాడుకోగలుగుతున్నాడు. ఈ క్రమంలనే టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్, మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ బాబర్ ను ఏకిపారేశాడు.

“బాబర్ కెప్టెన్సీ, అతడి బ్యాటింగ్ ఏదీ నాకు కరెక్ట్ గా అనిపించడం లేదు. అతడు ప్రపంచ కప్ లో గత ఆరు మ్యాచ్ ల్లో మూడు అర్దశతకాలు చేశాడు. కానీ అతడు నెం. 1 బ్యాటర్ గా ఎందుకున్నాడో నాకైతే అర్థం కావడంలేదు. పైగా అతడు మ్యాచ్ లను గెలిపించిన సందర్భాలు లేనే లేవు. అతడి రికార్డులు, ర్యాంకింగ్స్ అన్నీ ఓవర్ రేటెడ్. జట్టుకు విజయాలు అందించలేని రికార్డులు ఎన్ని సాధించినా వేస్టే” అంటూ సెహ్వాగ్ బాబర్ ను విమర్శించాడు. ఇక ఓ నెం.1 ప్లేయర్ కు ఉండాల్సిన అర్హతలేవీ బాబర్ లో లేవని వీరూ అభిప్రాయపడ్డాడు. అతడు ఎక్కువగా వ్యక్తిగత రికార్డుల మీదే దృష్టిపెడుతున్నాడని ఎద్దేవచేశాడు. అతడి ఆట చూస్తుంటే.. నెం.1 ర్యాంక్ ను కాపాడుకోవడానికే ఆడుతున్నట్లు అనిపిస్తుందని సెహ్వాగ్ కామెంట్స్ చేశాడు. మరి వీరూ భాయ్ బాబర్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.