2011 వరల్డ్ కప్ లో ధోని సెంటిమెంట్ రివీల్ చేసిన సెహ్వాగ్! రోహిత్ కూడా అలాగే చేయాలంటూ..!

  • Author Soma Sekhar Published - 06:01 PM, Wed - 28 June 23
  • Author Soma Sekhar Published - 06:01 PM, Wed - 28 June 23
2011 వరల్డ్ కప్ లో ధోని సెంటిమెంట్ రివీల్ చేసిన సెహ్వాగ్! రోహిత్ కూడా అలాగే చేయాలంటూ..!

2011.. టీమిండియా క్రికెట్ చరిత్రలో ఈ సంవత్సరం మరపురానిది. సుదీర్ఘ కాలం తర్వాత వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడి.. సచిన్ కు బహుమతిగా ఇచ్చారు టీమిండియా ఆటగాళ్లు. ఇక ఈ వరల్డ్ కప్ లో తనదైన కెప్టెన్సీతో అబ్బుర పరిచాడు మిస్టర్ కూల్ ధోని. అయితే ధోని ఈ ప్రపంచ కప్ లో ఓ సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడని చెప్పుకొచ్చాడు టీమిండియా డాషింగ్ బ్యాటర్, మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. దాంతో ఆ సెంటిమెంట్ నే 2023 వరల్డ్ కప్ లో రోహిత్ ఫాలో అవ్వాలంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. మరి ధోని పాటించిన ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను క్రియేట్ చేసుకున్నాడు. టీమిండియాకు తన హయాంలో మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఘనత ధోని సొంతం. ఇక మరికొన్ని రోజుల్లో 2023 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో 2011 ప్రపంచ కప్ లో ధోని పాటించిన సెంటిమెంట్ ను రివీల్ చేశాడు డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. గ్రౌండ్ లో ఎంతో కూల్ గా కనిపించే ధోనికి.. ఓ విచిత్రమైన సెంటిమెంట్ ఉందట. ఈ విషయాన్ని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ విడుదల అయిన సందర్భంగా అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు సెహ్వాగ్. ఈ డాషింగ్ బ్యాటర్ మాట్లాడుతూ..”2011 వరల్డ్ కప్ సందర్భంగా జట్టులో సచిన్, హర్బజన్ తో పాటుగా ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉండేది. ఇక వారు ఆ సెంటిమెంట్ ను బలంగా నమ్మేవారు. అయితే ధోనికి మాత్రం విచిత్రమైన సెంటిమెంట్ ఉంది. ధోని ప్రపంచ కప్ పూర్తి అయ్యేవరకు కిచిడీ మాత్రమే తిన్నాడు. నేను ఎందుకు అని అడిగాను. దానికి ధోని.. నేను రన్స్ కొట్టకపోయినా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందిగా” అనేవాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. 2023 వరల్డ్ కప్ లో రోహిత్ కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారు నెటిజన్లు. రోహిత్ శర్మ కూడా ధోనిలా కిచిడీ తింటే టీమిండియా గెలుస్తుందని వారు భావిస్తున్నారు. కాగా.. 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడానికి మేం 2008 నుంచే సన్నాహకాలు మెుదలుపెట్టామని వీరూ తెలిపాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో టీమిండియా రెండు ప్లాన్లు సిద్దం చేసుకోవాలని సూచించాడు. ఒక ప్లాన్ విఫలం అయినా గానీ మరోటి విజయవంతం అవుతుందని చెప్పుకొచ్చాడు.

Show comments