iDreamPost
android-app
ios-app

అరబ్‌ షేక్‌ అవతారంలో వీరేందర్‌ సెహ్వాగ్‌! ఊహించని రెస్పాన్స్‌

  • Published Feb 18, 2024 | 12:36 PM Updated Updated Feb 18, 2024 | 12:36 PM

కొంతమంది స్టార్‌ క్రికెటర్లు ఏం చేసినా అది హైలెట్‌ అవుతూ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో లేకపోయినా.. వారి ప్రతి కదలిక సంచలనమే.. తాజాగా సెహ్వాగ్‌ చేసిన ఒక పని వైరల్‌గా మారింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

కొంతమంది స్టార్‌ క్రికెటర్లు ఏం చేసినా అది హైలెట్‌ అవుతూ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో లేకపోయినా.. వారి ప్రతి కదలిక సంచలనమే.. తాజాగా సెహ్వాగ్‌ చేసిన ఒక పని వైరల్‌గా మారింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 18, 2024 | 12:36 PMUpdated Feb 18, 2024 | 12:36 PM
అరబ్‌ షేక్‌ అవతారంలో వీరేందర్‌ సెహ్వాగ్‌! ఊహించని రెస్పాన్స్‌

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌కు సెపరేట్‌ ఫ్యాన​్‌ బేస్‌ ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాక కామెంటేటర్‌గా మారిన సెహ్వాగ్‌.. సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు. టీమిండియా ఆడే మ్యాచ్‌లపై విశ్లేషణ ఇస్తూనే.. కొన్ని విషయాల్లో చాలా సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తూ ఉంటాడు. అందుకే సెహ్వాగ్‌ను కొన్ని కోట్ల మంది ఫాలో అవుతుంటారు. అయితే.. తాజాగా సెహ్వాగ్‌ అరబ్‌ షేక్‌ల వస్త్రాధారణలో కనిపించి.. అందరికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెహ్వాగ్‌ అరబ్‌ షేక్‌ గెటప్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

అయితే.. ఈ ఫొటోలపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి. ఈ గెటప్‌లో అదిరిపోయావ్‌ అంటూ కొంతమంది మెచ్చుకుంటూ ఉంటే.. మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. కామెంటేటర్‌గా పనిచేయాలంటే.. ఇన్ని వేశాలు వేయాలా? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ సెహ్వాగ్‌ ఇలా అరబ్‌ షేక్‌గా కనిపించింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో. శనివారం ఐఎల్‌టీ20 లీగ్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా సెహ్వాగ్‌ ఇలా అరబ్‌ షేక్‌ గెటప్‌లో కనిపించాడు. సెహ్వాగ్‌ ఒక్కడే కాదు.. కామెంటేటర్లంతా ఇలానే అరబ్‌ షేక్‌ డ్రెస్సులు వేసుకున్నారు.

ఇక ఫైనల్‌ మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ ఫైనల్‌ ఎంఐ ఎమిరేట్స్‌తో దుబాయ్‌ క్యాపిటల్స్‌ టీమ్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు మొహమ్మద్‌ వసీమ్‌ 43, కుషాల్‌ పెరీరా 38 పరుగులు చేసి రాణించారు. తర్వాత ఆండ్రీ ఫ్లెచర్‌ 59, కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ 57 పరుగులతో విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా పూరన్‌ ఏకంగా 6 సిక్సలతో అల్లాడించాడు. ఫ్లెచర్‌ అవుటైనా.. పూరన్‌, పొలార్డ్‌(9) నాటౌట్‌గా నిలిచారు. డీసీ బౌలర్లలో ఓల్లీ స్టోన్‌, సికందర్‌ రజా, జహీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనకు దిగిన డీసీ.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసి.. ఓటమి పాలైంది. దీంతో.. ఎంఐ ఎమిరేట్స్‌ ఛాంపియన్‌గా అవతరించింది. మరి ఈ ఫైనల్‌ సందర్భంగా సెహ్వాగ్‌ అరబ్‌ షేక్‌ గెటప్‌ వేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.